రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌లు విల‌క్ష‌ణ‌మైన తీర్పు ప్ర‌తిపాదించారు. త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని ప్ర‌జ‌లు ఎన్నుకొ న్నారు. ఈ క్ర‌మంలోనే తానే హైద‌రాబాద్‌ను క‌ట్టించాన‌ని, తాను లేక పోతే.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి దిక్కెవ‌ర‌ని?  తాను లేక పోతే.. అమ‌రావ‌తి, పోల‌వరం వంటివి ఆగిపోతాయ‌ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేసుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం చంద్ర‌బాబును ఎక్క‌డా క‌రుణించింది లేదు. పోనీ.. తొలిసారి.. నారా వంశాంకురం ప్ర‌జాక్షేత్రంలోకి దిగితే.. దీనిని కూడా ప్ర‌జ‌లు ఆశీర్వ దించ‌లేక పోయారు. ప‌సుపు-కుంకుమ‌, రైతురుణ‌మాఫీ, అన్న‌దాతాసుఖీభ‌వ వంటి ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన చం ద్ర‌బాబుకు విజ‌యం త‌థ్య‌మ‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేసుకున్నారు ధీమాగా కూడా ఉన్నారు. 


ముఖ్యంగా పార్టీకి, ప్ర‌భుత్వానికి మౌత్ పీస్ మాదిరిగా ఉండే.. ఓ ద‌మ్మున్న ప‌త్రిక కూడా టీడీపీదే అధికారం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. అయితే, ఫ‌లితాలు వ‌చ్చాక నిజానిజాలు, ప్ర‌జ‌లు ఎవ‌రికి అధికారం ఇవ్వాల‌నుకున్నారో స్ప‌ష్టంగా తెలిసిపోయింది. దీంతో ఈ ప‌త్రిక నిండా నిర్వేదంలో మునిగిపోయింది.  తాము మ‌ద్ద‌తిచ్చిన పార్టీ.. క‌మ్మ‌గా రాజ్యాన్ని ఏలుతుంద‌ని భావిస్తే.. ఇప్పుడు ఇలా జ‌రిగిందేంట‌నే ఆవేద‌న‌లోనూ నిండిపోయింది. ఇక‌, జ‌గ‌న్‌కు, ఈ ప‌త్రికాధిప‌తికి మ‌ధ్య ఉన్న వైరం.. ఈ నాటిదికాదు. త‌ర‌త‌రాలుగా ప‌ట్టి కుదిపేస్తున్న పంతం, వైరం కూడా! వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో ప్రారంభ‌మైన ఈ వైరం నేటికీ పిల‌క‌లు క‌డుతూ.. పెరిగిందే త‌ప్ప ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 


అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌రోసారి కొలువుదీరాల‌ని భావించినా అది జ‌ర‌గ‌క పోయే స‌రికి.. ద‌మ్ము న్న  ప‌త్రిక విధిలేని ప‌రిస్థితిలో జ‌గ‌న్‌కు ప‌ల్ల‌కీలు మోయాల్సి వ‌చ్చింది. అయినా.. క‌డుపులో మాత్రం జ‌గ‌న్‌పై ఉన్న ద్వేషాన్ని మాత్రం విడిచి పెట్ట‌లేదు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇప్ప‌టికిప్పుడు ఇంకా సీఎంగా ప్ర‌మాణం కూడా చేయకుండానే జ‌గ‌న్‌పై విరుచుకుప‌డితే.. త‌న‌కే మ‌చ్చ వ‌స్తుంద‌ని భావించాడో ఏమో.. ఈ ప‌త్రికాధినేత‌..తాజాగా ఆయ‌న వారం వారం వ‌డ్డించే స‌రికొత్త ప‌లుకులో మాత్రం జ‌గ‌న్‌ను ఒకింత ఆకాశానికి ఎత్తేశాడ‌నే చెప్పాలి. అయితే.,. ఇది మ‌న‌సులోంచి వ‌చ్చిన అభిమానం కానేకాద‌ని ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. 


కేవ‌లం అక్ష‌రాల్లో మాత్రం అభిమానం చూపించారు. అదేస‌మ‌యంలో నిన్న‌టికి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీ స్సుల కోసం జ‌గ‌న్ వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డ కేసీఆర్ ప‌లికిన ఆహ్వానం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. తొలి సారి కేసీఆర్ ఓ ప‌క్క రాష్ట్ర సీఎంకు ఇంత రేంజ్‌లో స్వాగ‌తం ప‌ల‌క‌డం మేధావుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, జ‌గ‌న్ కోరిన ప్ర‌త్యేక హోదాకు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో ఈ ప‌రిణామం ఈ ద‌మ్మున్న ప‌త్రిక య‌జ‌మానికి కంట్లో న‌ల‌క‌మాదిరిగా మారిపోయింది. ఆ వెంట‌నే ఆయ‌న త‌న కాల‌మ్‌లో విషాన్ని క‌క్కేశారు.


 జ‌గ‌న్‌తో ఎప్ప‌టికైనా కేసీఆర్‌కు ప్ర‌మాద‌మేన‌ని క‌మ్మ‌గా కులాల కుంప‌ట్ల‌లో పుల్లలు పేర్చి రాజేశారు. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం దండ‌గ అనే రేంజ్‌లో కుమ్మేశాడు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో వ‌చ్చిన వ్య‌తిరేక‌త కార‌ణంగానే ఇటీవ‌ల మూడు ఎంపీ స్థానాల్లో కేసీఆర్ ఓడిపోయారు. దీంతో రెడ్డి వ‌ర్గాన్ని బీజేపీ దువ్వుతోంద‌ని, కానీ, నువ్వు జ‌గ‌న్‌ను చంక‌లో పెట్టుకుంటున్నావ‌ని, దీనివ‌ల్ల న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని స‌రికొత్త‌గా పుల్లలు పెట్టారు. మొత్తానికి ఏపీలో జ‌గ‌న్‌కు కేసీఆర్ స‌హ‌క‌రించకుండా చూడాల‌నే ప‌చ్చ‌పార్టీ వ్యూహంలో తొలి అడుగుగా దీనిని భావిస్తున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: