ఆ మద్య ఏపిలో ఎన్నో సంచలనాలు సృష్టించిన కోడి కత్తి అంశం ఎన్నో మెలికలు తిరిగింది.   వైఎస్ జగన్ పై శ్రీనివాస్ రావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేయడం జగన్ భుజం పై గుచ్చుకోవడం తెలిసిందే.  ఈ నేనథ్యంలో శ్రీనివాస్ రావు పై హత్యానేరం కింద రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు.  మొన్న శనివారం శ్రీనివాస రావు బెయిల్ పై రిలీజ్ అయ్యాడు.  ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తాను కోడికత్తితో దాడి చేయలేదని, అది ఫ్రూట్‌ సలాడ్‌ కత్తి అని, తన కంగారులో ఆయనకు అప్పుడు ఏమి జరిగిందో కూడా చూడలేదని నిందితుడు శ్రీనివాస రావు అన్నాడు. 


నిజంగా జగన్ ఎంతో దయార్థ హృదయుడని..ఆయన మనసు నిజంగా గొప్పదని నన్ను ఆరోజు కొంత మంది కొడుతుంటే..ఆయనే వచ్చి వారిని ఆపాడని అన్నారు.  తనకు టీడీపీతో ఏ విధమైన సంబంధం లేదని, ఈ రోజు తాను ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే కారణమని శ్రీనివాస రావు అన్నాడు. అలాంటి మంచి మనిషి కనుకనే ఏపి ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని..అఖండ విజయాన్ని అందించారని అన్నారు.

తాను కుక్‌ని అని, అది కోడికత్తి కాదని, ఫ్రూట్‌ సలాడ్‌ నైఫ్‌ అని, తన జేబులో అలాంటివి రెండు ఉన్నాయని చెప్పాడు. కొన్ని సమస్యలను తీసుకుని జగన్‌ వద్దకు వెళ్లానని, కంగారులో ఆయనకు చిన్నది గీసుకుందని శ్రీనివాస రావు చెప్పాడు.

అంత గొప్ప మనిషిని నేను ఎందుకు చంపుతానని...హత్యాప్రయత్నం చేశానని, దేనికయినా లోబడ్డానని, సింపతీ కోసమని అనుకుంటే నార్కో ఎనాలసిస్‌ పరీక్షకు తాను సిద్ధమని, ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిన వస్తువులు చూస్తే చిన్న నైఫ్‌, ఫోర్క్‌ దొరికాయని అన్నాడు. జగన్‌కు శ్రీనివాసరావు వీరాభిమాని అని అతని సోదరుడు సుబ్బరాజు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: