2019 ఎన్నిక‌ల్లో అమేధీలో రాహుల్‌గాంధీ చాలా అవ‌మాన‌క‌ర రీతిలో ఓడిపోయారు. భార‌తదేశ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేసులో ఉన్న రాహుల్ ఎంపీ సీటులో ఓడిపోవ‌డం అంటే చాలా అవ‌మాన‌మే. అందుకే రాహుల్ ముందుగా సేఫ్ జోన్ కోసం కేర‌ళ‌లోని వాయ‌నాడ్ నుంచి కూడా పోటీ చేసి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక త‌మ ఫ్యామిలీకే సుదీర్ఘ‌కాలంగా కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోన్న అమేధీలోనే రాహుల్ ఘోరంగా ఓడిపోయారు. వాస్త‌వంగా చూస్తే గ‌త ఎన్నిక‌ల్లోనే రాహుల్‌కు అక్క‌డ ప్ర‌మాద ఘంటిక‌లు మోగాయి. స్మృతి ఇరానీ దెబ్బ‌కు విల‌విల్లాడారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ప్రియాంక అక్క‌డ మాకం వేసి ఏదోలా అక్క‌డ రాహుల్‌ను నెగ్గించింది. ఇక ఈ సారి బీజేపీ ఆప‌రేష‌న్ అమేధీ దెబ్బ‌కు రాహుల్ ఓడిపోయాడు.


ఇక ఈ ఎన్నిక‌ల్లో ఫ్యాన్ సునామీలో మంత్రులంద‌రూ మ‌టాష్ అయిపోయారు. కుప్పంలో చంద్ర‌బాబు కూడా మూడు రౌండ్ల వ‌ర‌కు వెన‌కంజ‌లోనే ఉన్నారు. ఒక‌ప్పుడు 64 వేల నుంచి చంద్ర‌బాబు మెజార్టీ 47 వేల‌కు త‌గ్గింది. ఇక ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 30 వేల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అటు జ‌గ‌న్‌కు పులివెందుల‌లో 90 వేల పైచిలుకు మెజార్టీ వ‌చ్చింది. కుప్పంలో ఇన్నిసార్లు గెలుస్తూ.. మూడుసార్లు సీఎంగా ఉన్న వ్య‌క్తి ఇంత త‌క్కువ మెజార్టీతో గెల‌వ‌డం టీడీపీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పైగా అక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్ర‌మౌళికి ఈ ఎన్నిక‌ల్లో ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఆయ‌న ప్ర‌చారానికి రాలేదు. ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు కూడా ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. ఆ టైంలో కేవ‌లం స్థానిక నాయ‌కులు, చంద్ర‌మౌళి కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే ప్ర‌చారం చేశారు.


వైసీపీ శ్రేణులు. టీడీపీలోని స్థానిక నాయకులమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వారికి ఆకాంక్షను ఈర్చడానికి బాగానే ఉపయోగపడింది. తమ అభ్యర్థి ఓడిపోయినా సీఎం మెజార్టీ బాగా త‌గ్గించ‌డంతో వాళ్లంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక చంద్ర‌బాబు కూడా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఏదో ఒక రోజు కుప్పంలో ప్రచారం చేసేవారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక్క రోజు కూడా ప్ర‌చారానికి వెళ్ల‌కుండా అతిధీమా ప్ర‌ద‌ర్శించారు. స్థానిక నేత‌లు ఐదేళ్ల‌పాటు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించి చంద్ర‌బాబు పేరు పూర్తిగా చెడ‌గొట్టారు. 


నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా పెరిగిన ఓటర్లు అంద‌రూ వైసీపీ వైపు మొగ్గు చూప‌డంతో చంద్ర‌బాబు మెజార్టీ బాగా ప‌డిపోయింది. మొత్తం నాలుగు మండలాలలోనూ కౌంటింగ్‌ రోజున ఉదయంనుంచే ప్రారంభమైన వారి సంబరాలు ఆరోజు రాత్రిదాకా కొనసాగాయి. పాత‌త‌రం నేత‌లు, ప్ర‌జ‌లు త‌ప్ప యువ‌త అంతా ఇప్పుడు బాబుకు ఓటేసేందుకు కుప్పంలోనే ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఇప్పుడు ఇక్క‌డ వైసీపీకి కావాల్సింద‌ల్లా నాయ‌క‌త్వ స‌మ‌స్య‌. జ‌గ‌న్ ఇక్క‌డ స‌రైన నాయ‌కుడిని రంగంలోకి దింపితే కుప్పంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ మ‌రింత బ‌లోపేతం అవ్వ‌డంతో పాటు ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రిన్ని సంచ‌ల‌నాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి న‌మోదైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. 


నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ చాలా బ‌లంగా ఉంద‌ని అర్థ‌మైంది. ఇప్పుడు ఇక్క‌డ పార్టీని ఏకతాటిపై నడిపే నాయకుడు కొరవడడంతో నియోజకవర్గంలో ఎవరికివారుగా గ్రూపులు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం నాలుగు మండలాల్లోనూ ఇదే పరిస్థితి రాజ్యమేలుతోంది. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడికి ఇక్క‌డ బాధ్య‌త‌లు ఇస్తే 2024లో అమేధీలో ఈ ఎన్నిక‌ల్లో రాహుల్‌కు వ‌చ్చిన ప‌రిస్థితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబుకు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: