ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటే లోకేష్ అని అంటారు. చంద్రబాబు పాలనతో అవినీతి, తమ్ముళ్ల అక్రమాలు ఇవన్నీ ఉన్నా కూడా ఎమ్మెల్యే కాకుండా లోకేష్ ని మంత్రిని చేసి కీలకమైన శాఖలు అప్పగించడం పట్ల జనంలో ఓ విధమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా యువత ఈ విషయంలో టీడీపీకి బాగా  యాంటీ అయ్యారు కూడా.


మాకు జాబ్స్ లేవు. కొడుక్కు మాత్రం మంత్రి పదవులే ఇచ్చారంటూ గుర్రుమన్న యూత్ అంతా వైసీపీకి ఓటేశారు. ఇక మంగళగిరిలో బీసీకి టికెట్ ఇస్తామని  చెప్పి మాజీ ఎమ్మెల్యే కమలను తీసుకువచ్చి చేర్చుకున్న తరువాత చివరి నిముషంలో లోకేష్ ని పెట్టడంతో అక్కడ బీసీలు పూర్తి వ్యతిరేకం అయిపోయారు. అలా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు.


రాజకీయ దురంధరుడైన బాబుకు ఇవన్నీ తెలియవనుకోవాలా. అయినా అయన ఇపుడు మరో ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా చేయాలన్నది బాబు ఆలొచనట. ఇపుడు మండలిలో పెద్దాయన, బీసీ వర్గానికి చెందిన యనమల రామక్రిష్ణుడు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


మరి ఆయన్ని తప్పించి లోకేష్ అంటే మరోమారు బీసీలు గుర్రుమనడం ఖాయం. నిన్ననే ఓటమిపాలు అయిన లోకేష్ ని ప్రతిపక్ష నేతగా పెట్టడం అంటే మళ్ళీ నెత్తిన రుద్దడమే. ఇది పార్టీలో కూడా కొత్త వివాదానికి దారితీయవచ్చేమో. చూడాలి మరి బాబు గారికి ఇపుడు కొడుకు బెంగ బాగా పట్టుకున్నట్లుంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: