మొన్నటి తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘోరపరాభవమే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ములేపిన కారు.. కేవలం ఆరునెలల్లోనే జోరు కోల్పోయింది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయింది. 


తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెల్చుకున్న బీజేపీ ఏకంగా  నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. పార్టీకి జరిగిన ఈ అవమానం అభిమానులను దహించివేస్తుంది. ఆ కోపం నుంచే ఓ అభిమాని కేసీఆర్ ను ప్రశ్నిస్తూ పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి..

టీఆరెస్ ఓటమి - కొన్ని ప్రశ్నలు?
నాదెప్పటికీ తెలంగాణవాదమే, నాపార్టీ టీఆరెస్సే, నా నాయకుడు ముమ్మాటికీ కేసీఆరే. లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ 7 సీట్లలో ఓడిపోవడం నాకు సిగ్గు చేటుగా ఉంది.

"చోటీ మూ, బడీ బాత్" అయితదేమోనని చాలరోజులు తటపటాయించిన. అయినా సరే ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతా. నా లాంటి అతి చిన్న స్థాయి passive కార్యకర్త నుంచి జిల్లా-రాష్ట్ర స్థాయి వరకు కష్టపడ్డ క్రియాశీలక వ్యక్తులందరూ ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలు ఏడాది రెండేళ్లుగా online-offlineలో నలుగుతున్నా వాటికి సమాధానాలు చెప్పేవారు లేరు. నేను కూడా కొన్నిసార్లు ప్రశ్నించకుండా ఉండిపోయా, ఇంకొన్నిసార్లు ప్రశ్నించేవారిని సముదాయించడమో, అంత పెద్ద విషయాలు మనకెందుకులే, పెద్దవాళ్లు చూసుకుంటారులే అని విషయన్ని అక్కడితో వదిలేశాను. కొందరితో గొడవపడి దూరం చేసుకున్నాను, శతృవులను తయారు చేసుకున్నాను. కాని ఆ ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమధానాలు లేవు. చూద్దాం ఈ ఓటమైనా సమాధానాలు రాబడుతుందేమో!

1. హరీష్ రావుని ఎందుకు పక్కన పెట్టారు? అలాంటిదేమీ లేదని సొల్లు చెప్పొద్దు. తెలంగాణావాదానికి, పార్టీకి, అధినేతకు సైనికుడిగా సేవలందించిన వ్యక్తిని విస్మరించడం ఎంతవరకు సమంజసం? అసలు హరీష్ రావుకి ప్రత్యామ్నాయం ఉంటుందని ఎలా భ్రమపడ్డారు? అది జనాల్లో ఎంత నెగెటివ్‌గా పోయిందో కనీసం అవగాహన ఉందా?

2. 88 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకో 10-12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 2014లో పార్టీ ఫిరాయింపులను నేను కూడా సమర్ధించాను. పార్టీ బలోపేతం కోసం, అప్పటి రాజకీయ పరిస్తితుల్లో అసెంబ్లీ బలం ముఖ్యం కాబట్టి ఫిరాయింపులు తప్పలేదు. కానీ ఇప్పుడా అవసరం ఏంటి?

3. గత ఐదేళ్లుగా (2014 నుంచి) మన అధినేత..... నాయకులకు, ఎమ్మెల్యేలకు, కనీసం మంత్రులకు కూడా అందుబాటులోకి రావడం లేదనే బహిరంగ రహస్యాన్ని ఎలా సమర్థించుకుంటాం? అద్భుతంగా పని చేస్తున్నాడు, అభివృధి జరుగుతున్నది కాబట్టి అందుబాటులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకొని ఊర్కోవాలా? విమర్శించే నోళ్లను ఎంతకాలం మూయిస్తాం, ఎన్నిసార్లని లైట్ తీస్కుంటాం? ఎప్పుడో ఒకప్పుడు సమధానం రావాలి కదా?

4. కేటీఆర్ చుట్టూ ఒక మాయా కోటరీ తయారైందని ఆయన మంత్రి అయినప్పటి నుంచి ఎంతమంది మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ కోటరీ ముఠాకి అడ్డులేకుండా పొయిందని సొషల్ మీడియాలో నెత్తినోరు బాదుకుంటున్నవారికి కంఠశోష మిగిలింది. ఇది మారేదెన్నడు?

5. ఈ భజనపరుల బృందాలు సొషల్ మీడియలో పేజీలు, గ్రూపులు కట్టి ఒకటే ఊదరగొడుతారు. నాయకుడు ఏది చెప్పినా, ఏం చేసినా కరెక్టే అనే సైకోఫాన్సీని పెంచి పోషించడం దేనికి మంచిది? ఇదేంటని ప్రశ్నించేవారిని, మరో అభిప్రాయం వెలుబుచ్చేవారిని నోరు మూయించేయడం, నాయకత్వానికి తెలిసే జరుగుతుందా? ఈ భజనపరుల థాట్ పొలీసింగ్ కూడా ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని ఇలాంటి వారివల్ల పార్టీకి చెడే తప్ప, మంచి జరగదనే నిజాన్ని పార్టీ పెద్దలు ఇప్పటికైనా గ్రహిస్తారా?

6. ఇక లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనైతే మరీ టూ మచ్. ఈ నామా నాగేష్వర్‌రావు ఎవడు? వాన్ని ఎందుకు టీఆరెస్ క్యాండిడేట్‌గా ఒప్పుకోవాలి, ఎందుకు ఓట్లేసి గెలిపించాలి? వాడు మన ఆగర్భ శతృవు చంద్రబాబుకి చంచా. ఇప్పటికే చాలా చంచాలను మౌనంగా భరించేవాళ్లకు వీడు అవసరమా? ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డికి ఏం తక్కువైంది?

7. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, జితేందర్ రెడ్డిని మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడన్నా దూరం చేసుకుంటాడా? సికిందరాబాద్‌లో తలసానిని నెత్తికెక్కించుకోవడమే ఎక్కువనుకుంటే, ఆయన సుపుతృన్ని గెలిపించాలా? మజాక్ అయితుందా? ఓడిపోతారు అని ఏడ్చి మొత్తుకున్నా, ఠాఠ్ మీకేం తెలుసు అని నోర్లు మూయించిన్రు.

8. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి గాని, అడిగి ప్రయోజనం లేదని అర్థమైంది. కొందరు నాయకుల arrogance, వందిమాగదుల sycophancy...... వెరసీ 7 సీట్లలొ ఓటమి!


మరింత సమాచారం తెలుసుకోండి: