ఏపీకి కాబోయే సీఎం జగన్..పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ఆంధ్రరాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. ఏ చర్యలు తీసుకున్నా కూడా.. టెండర్‌ క్యాన్సిల్‌ చేసి రివర్స్‌ టెండరింగ్‌ పిలిచి ఈ మేరకు స్కామ్‌ జరిగిందని చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం.


టెండర్లు పిలిచినప్పుడు వెంటనే చెబుతాం.. ఈ ప్రాజెక్టు.. ఈ సమయంలోపు చేయాలని చెబుతాం. కేంద్రం ప్రభుత్వాన్ని ఇన్వాల్స్‌ చేసి వారి ద్వారానే టెండర్లు వేయించాల్సిన అవసరం ఉంటే వారితోనే చేయిస్తాం. మాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడమే అవసరం.. ఇవీ జగన్ చెప్పిన మాటలు..

అవసరమైతే మళ్లీ టెండర్లు పిలిచేందుకు కానీ.. కేంద్రంతోనే మళ్లీ టెండర్లు వేేయించే పని కానీ చేస్తామని జగన్ అంటున్నారు. అదే జరిగితే.. పోలవరం పేరుతో జరిగిన స్కాములన్నీ బయటకి వస్తాయి. ఇది మంచి పరిణామమే.. కానీ అదే సమయంలో టెండర్ కోల్పోయిన కంపెనీలు కోర్టులకు వెళ్తే... కోర్టుల కారణంగా పోలవరం ఆలస్యమైతే.. రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంది. 

అందుకే పోలవరం ప్రాజక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు జగన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం కేంద్రాన్ని ఒప్పించాలి. అధిక నిధులు తెచ్చుకోవాలి.. దీనిపై సరిగ్గా దృష్టి పెట్టకపోతే.. వ్యతిరేక వర్గాలు అవకాశం కాచుకుని ఉంటాయి. జగన్ వైఫల్యంగా దీన్ని చిత్రించే అవకాశం ఉంది. ఈ విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: