ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ ఎన్డీఏలో చేరబోతుందా.. అంటే ఆ అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం ప్రధాన మంత్రి మోడీనికి కలసిన జగన్.. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 


ఈ అంశంపై చర్చించిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఎన్డీఏలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చిద్దామని షా అన్నారట.  అమిత్ షా ఆహ్వానంపై అప్పటికప్పుడు ఏమీ చెప్పని జగన్.. పార్టీలో చర్చించి నిర్ణయించి తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది.

ఎన్డీఏలో చేరితే రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తామని అమిత్ షా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి పౌరవిమానయాన శాఖ కాగా ఇంకొకటి ఏదైనా  సహాయ మంత్రి పోస్ట్ ఉండే అవకాశం ఉందట.  ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఒకవేళ ప్రత్యేక హోదాపై జగన్ నిర్ధిష్టమైన హామీ.. తక్షణ ప్రకటన ఏమీ లేకుండా ఎన్డీఏలో చేరితే.. గతంలో టీడీపీకి ఎదురైన చేదు అనుభవమే ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవుల కోసం ఎన్డీఏలో చేరి హోదా సాధించడం కుదరకపోతే..అది చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: