బీజేపీ మరోసారి అఖండ మెజారిటీ సాధించింది. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన నాయకుడిగా నరేంద్రమోడీ కొత్త చరిత్ర లిఖించాడు. వాస్తవానికి ఇది నెహ్రూను మించిన విజయం.. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో నెహ్రూ ఆ ఫీట్ సాధించడంతో పోలిస్తే ఈ కాలంలో మోడీ ఈ ఘన విజయం సాధించడం మూమూలు విషయం కాదు.


అదే సయమంలో ఈసారి భారత లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితాలను పరిశీలిస్తే.. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపుగా 67 మంది వరకూ బ్రాహ్మణులు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంటే ఇది దాదాపు 13 శాతం వరకూ ఉంటుంది. 

ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో బ్రాహ్మణులు చట్టసభలకు ఎన్నికకావడం ఓ రికార్డు.. బ్రాహ్మణులు విద్య, ఉద్యోగ రంగాల్లో ముందంజలో ఉంటారు. ఐఏఎస్ వంటి మేథో పరమైన ఉద్యోగాల సాధనలోనూ వీరిది అందె వేసిన చేయి.. కానీ రాజకీయాల్లో సంఖ్యాపరంగా కాస్త వెనుకంజలోనే ఉంటారు.   

ఎన్నికల వ్యవస్థలో ఉన్న రిజర్వేషన్లు ఇందుకు ఓ కారణం కావచ్చు. పార్టీలు కూడా టికెట్ల కేటాయింపులో అన్ని సామాజికవర్గాలనూ బేరీజు వేసుకోవాల్సి రావడం వల్ల.. అందరికీ అవకాశాలు కల్పించాల్సి రావడం కారణంగా ఈ సంఖ్య తగ్గుతుంటుంది. కానీ బీజేపీ ఈసారి బ్రాహ్మణులకు పెద్ద పీట వేసింది. వారు కూడా అధిక సంఖ్యలో గెలిచి లోక్ సభలో బ్రాహ్మణ రాజ్యాన్ని సృష్టించారని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: