సంఖ్యా శాస్త్రాన్ని నమ్మని వారు కూడా కొన్ని సార్లు నమ్మకతప్పదేమో. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసెపీ జాతకాలు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రతిపక్షానికి తీసికట్టుగా సీట్లు తెచ్చుకుంది. మతలబు ఎక్కడుంది.


జగన్ విషయానికి ముందుగా వస్తే ఆయనకు 150 నంబర్ కి ఒక  గమ్మత్తైన సంబంధం ఉంది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2009 సెప్టంబర్లో వైఎస్సార్ చనిపోయారు. ఆయన వారసునిగా కొత్త సీఎం గా జగన్ని ఎన్నుకోవాలని అప్పట్లో 150 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి  హై కమాండ్ కి పంపారు. అపుడు కాంగ్రెస్ అధినాయకత్వం జగన్ని పక్కన పెట్టేసింది.


ఆ తరువాత జగన్ ఆ పార్టీని వదిలేసి జనాల్లోకి రావడం, గత ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి మారడం, తాజా ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారం చేపట్టడం జరిగిపోయాయి. ఇక జగన్ పార్టీకి వచ్చిన సీట్లు 151. అంటే అప్పట్లో జగన్ ఏ 150 మంది ఎమ్మెల్యేలు అయితే సీఎం కావాలని సంతకాలు పెట్టరో అంతే నంబర్ మళ్ళీ జగన్ సంపాదించుకుని ముఖ్యమంత్రి అవబోతున్నారు. . ఈ మ్యాజిక్ నంబర్ మళ్ళీ జగన్ని ఈసారి సీఎం ని చేస్తోంది.


ఇక బాబు విషయానికి అస్తే మే 23న 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి దక్కారు. ఆ పార్టీ వైసీపీ  నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసింది.  అలాగే ముగ్గురు ఎంపీలను లాక్కుంది. ఇపుడు రిజల్ట్ చూస్తే ఆ నంబరే టీడీపీ దగ్గర మిగిలింది. ఇది కూడా గొప్ప నంబర్ మ్యాజిక్. సంఖ్యా శాస్త్రం నమ్మని వారు సైతం ఇదేదో గమ్మత్తుగా  జరిగిందే అనుకునేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: