రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.  కొత్త పార్టీ వైకాపా అధికారంలోకి వచ్చింది.  గడిచిన ఐదేళ్ళలో అధికారంలో ఉన్న పాత పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది.  ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేసింది.  ఎక్కడ మంచి పనులు జరిగాయి.  ఎక్కడ జరగలేదు.  అవినీతి జరిగిందా లేదా.  అదే జరిగితే ఎవరు చేశారు... అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకుంటారు.  ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట తెలుసుకునే అంశమే ఇది.  ప్రతిపక్షంలో ఉండగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది ప్రభుత్వం అని అరిచేది ప్రతిపక్షమే కాబట్టి దానిపై దృష్టి పెడుతుంది.  


ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ఇలాగే చేయబోతున్నాడు.  గడిచిన ఐదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించాడు.  అవినీతి ఎక్కడెక్కడా ఎంత జరిగిందో తెలుసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి.  అంతేకాదు, వరసగా ప్రతి శాఖ నుంచి శ్వేతపాత్రలను రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది.  ఇదే జరిగితే బాబుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి.  


అవినీతి జరిగిందని తెలిస్తే... ఎవరిమీదైనా యాక్షన్ తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నాడు.  పోలవరం, రాజధాని భూముల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఇక్కడ ఏదైనా లోపాలు జరిగినట్టు తెలిస్తే... దానికి సహకరించిన అధికారులపైనా, అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులపైనా కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: