రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయను కూడా నడిపించేది  ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై లెక్క లేనన్న ఆరోపణలు రావటానికి సిఎంవోలో పనిచేసిన ఉన్నతాధికారులే ప్రధాన కారణం.

 

సిఎంవో ఉన్నతాధికారులే అంతా తామే అయి నడిపించటంతోనే చంద్రబాబు పాలన మొత్తం ఓ పద్దతి పాడు లేకుండా సాగిందనే ఆరోపణలు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వారే ఎన్నోసార్లు ఆరోపించారు. అంతటి కీలకమైన సిఎంవోలో పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి టీం రెడీ అయిపోతోందట.

 

రాష్ట్ర పర్యాటక శాఖ ఎండిగా పనిచేస్తున్న ధనుంజయరెడ్డి సిఎంవోలో చేరిపోయారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న ధర్మారెడ్డి కూడా సిఎంవోలోకి వచ్చేస్తున్నారని సమాచారం. కాకపోతే ధర్మారెడ్డి గతంలో టిటిడి జేఈవోగా పనిచేసినపుడు అనేక ఆరోపణలున్నాయి.

 

అలాగే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా జగన్ బృందంలొకి వచ్చేస్తున్నారట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ్ కల్లం ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కానున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే స్టీఫెన్ రవీంద్ర నియమితులు కానున్నట్లు సమాచారం. సరే ప్రధాన కార్యదర్శిగా  ఎల్వీ సుబ్రమణ్యమే కొనసాగే అవకాశం ఉంది.

 

ఇపుడు సిఎంవోలో పనిచేస్తున్న చంద్రబాబు బృందంలో చాలామందిపై అంత్యంత అవినీతి ఆరోపణలున్నాయి. వారందరినీ జగన్ దూరంగా పెట్టేస్తారనే ప్రచారం జరుగతోంది. దానికి తోడు వాళ్ళల్లో చాలామంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి జగన్ వీలైనంతలో మంచి టీంనే తీసుకుంటారనే అనుకుంటున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: