లటడపాటి రాజగోపాల్..ఈ పేరు వింటే ఆంధ్రా ఆక్టోపస్ గుర్తుకు వస్తుంది.  ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాలనలో తనదైన ముద్ర వేశారు.  దూకుడుగా వ్యవహరిస్తూ..సంచలన వ్యాఖ్యలు చేస్తూ అప్పట్లో ప్రతిరోజూ వార్తల్లో ఉండే వారు.  ఇక తెలంగాణ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ తరునపు నుంచి వకాలత్ పుచ్చుకొని తెగ హల్ చల్ చేశారు. 

ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏపిలో గప్ చుప్ గా తన రాజకీయాలు చేసకుంటూ వస్తున్నారు.  అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా ఈయన ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయా ఎన్నికల ఫలితాలు ముందుగానే చెప్పేస్తుంటారు..ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తాయని..ఆ పార్టీ అన్ని సీట్లు గెలుస్తాయని..ఊకదండపుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు.  


అయితే ఈయనగారి సర్వేలు ఒక్కటీ అనుకున్న స్థాయిలో రాకపోగా ఊహించని ఫలితాలు రావడం చూస్తూనే ఉంటాం.  అయితే లగడపాటి సర్వేలు నమ్ముకొని కొంత మంది బెట్టింగులు పెట్టి కోట్లల్లో నష్టపోయిన వారు ఉన్నారు.  ఇటీవల ఏపిలో టీడీపీ పాలనలోకి వస్తుందని..వైసీపీ కనీసం 30 సీట్లు రావని ముందుగానే సర్వేలు వెల్లడించారు.  కానీ విధి వైపరిత్యం..లగడపాటి ఖర్మ..ఫలితం.. 175 సీట్లకు 150 సీట్లు గెల్చుకొని వైసీపీ అఖండ విజయం సాధించింది.  సదరు లగడపాటి జోస్యాన్ని నమ్ముకొని చాలా మంది బెట్టింగులు పెట్టి విధిన పడే పరిస్తితి వచ్చింది.  


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి రాజగోపాల్ పై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: