రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ రేంజి ఐజిగా పనిచేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్న రవీంద్రను ఏపికి పంపాలని జగన్మోహన్ రెడ్డి మొన్న కెసియార్ ను కలిసినపుడు రిక్వెస్ట్ చేశారట. కెసియార్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.

 

ఉమ్మడి రాష్ట్రంలో స్వీఫెన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు చీఫ్ సెక్యురిటీ అధికారిగా పనిచేశారు. సమర్ధుడైన ఐపిఎస్ అధికారిగా రవీంద్రకు మంచి పేరుంది. పైగా వైఎస్ కుటుంబానికి రవీంద్ర బాగా సన్నిహితుడు. దాంతో జగన్ ఏరికోరి రవీంద్రను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకోవాలని నిర్ణయించుకున్నారట.

 

ఇదే పోస్టు కోసం సెంట్రల్ సర్వీసులో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా డెప్యుటేషన్ పూర్తి చేసుకుని ఏపికి వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు పలువురు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలోనే రవీంద్ర నియామకం అంటూ ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. ఏపికి డెప్యుటేషన్ కోసం రవీంద్ర కేంద్రానికి రిక్వెస్టు పెట్టుకున్నారట. తెలంగాణా ప్రభుత్వం ఎలాగూ సానుకూలంగానే ఉంది కాబట్టి మరో 15 రోజుల్లో నియామకం జరిగిపోతోందని తెలుస్తోంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: