ఏపీ సీఎంగా త్వ‌ర‌లోనే ప్ర‌మాణం చేయ‌నున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌నాల‌ను సృష్టించేందుకురెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారుకూడా. రాష్ట్రంలో మునుపెన్న‌డూ లేని విధంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తా న‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప‌రిపూర్ణ ప్ర‌క్షాళ‌ణ దిశ‌గా త‌న ప్ర‌భుత్వం దూసుకుపోతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్రంలో అవినీతిని అంత‌మొందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. నిజానికి అవినీతి కార‌ణంగానే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌గానికి సగం టికెట్ల‌ను కోల్పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న‌జ‌గ‌న్ అవినీతిని కూక‌టి వేళ్లతో స‌హా పెక‌లించేందుకు కృషిచేస్తాన‌న్నారు. 


ఇదిలావుంటే,మ‌రో సంచ‌ల‌నానికి కూడా ఆయ‌న త‌న ప్ర‌భుత్వాన్ని వేదిక చేయ‌నున్నారు. కీల‌క‌మైన అసెంబ్లీ స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు ప‌ద‌వులు కూడా చాలా కీల‌కం. ముఖ్యంగా అత్యంత భారీ మెజారిటీతో ఏర్ప‌డుతున్న ప్ర‌భుత్వం స‌జావుగా సాగేందుకు అసెంబ్లీ పూర్తిగా విని యోగ‌ప‌డాలి. ఈ క్రమంలోనే ఇద్ద‌రు మ‌హిళానాయ‌కుల‌కు డిప్యూటీ, స్పీక‌ర్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌నున్న ఇప్ప‌టికే అన‌ధికార వ‌ర్గాలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా న‌గిరి నుంచి రెండో సారి కూడా గెలిచిన ఎమ్మెల్యే ఆర్ కే రోజా, విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నుంచి వ‌రుస‌గా రెండో సారి విజ‌యం సాధించిన పుష్ప‌శ్రీవాణికి ఈ ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 


వాస్త‌వానికి రోజా జ‌గ‌న్ కేబినెట్‌లో హోం శాఖ మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని, దీనికి జ‌గ‌న్‌కూడా ఓకేగానే ఉన్నార‌ని ఇటీవ‌ల వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, పుష్ప శ్రీవాణి కూడా కేబినెట్ రేసులోనే ఉన్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం వీరికి అంత‌కు మించి అన్న‌ట్టుగా స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ద్వారా మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేసిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఒక‌సారి ప్ర‌తిభా భారతికి స్పీకర్‌ప‌ద‌విని అప్ప‌గించింది. ఇక‌, ఆ త‌ర్వాత తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌ద్మా దేవేంద‌ర్ గౌడ్ వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఇద్ద‌రూ స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప‌రిస్థితి లేదు. దీంతో జ‌గ‌న్ ఇద్ద‌రూ మ‌హిళ‌ల‌నే ఎంచుకుని రికార్డు సృష్టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజా స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: