రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. తాజాగా కర్ణాటకలో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో మన తెలుగు అమ్మాయి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుమలత నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎంపీగా గెలిచారు. సాక్షాత్తు సీఎం కుమారస్వామి తనయుడు జాగ్వార్ సినిమా హీరో ఆమె భారీ మెజార్టీతో సంచలన విజయం సాధించారు. సుమలత తెలుగమ్మాయి, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆమె. తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసి ఆ తర్వాత కన్నడ రెబల్ స్టార్ అంబ‌రీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని కర్ణాటకలో సెటిల్ అయిపోయారు. సుమలత భర్త గతంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.  ఆయ‌న కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.


తాజా ఎన్నికలకు ముందు సుమలత నుంచి కాంగ్రెస్ ఎంపీ సీటు ఆశించారు. ఈ విషయాన్ని ఆమె కాంగ్రెస్ అధిష్టానంకు సైతం విన్నవించుకున్నారు. అయితే కాంగ్రెస్ - జేడిఎస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. జేడీఎస్ నుంచి మండ్య సీటుకు సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్ పోటీ చేయగా... సుమలత స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సుమలతకు బిజెపి సపోర్ట్ చేయడంతో పాటు కన్నడ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు దర్శన్, యాష్‌ అంతా బహిరంగంగా ప్రచారం చేశారు. చివరకు ఈ ఎన్నికల్లో సుమ‌ల‌త‌ ఘన విజయం సాధించారు, కర్ణాటకలో గెలిచిన ఇద్దరు మహిళా ఎంపీల్లో సుమలత ఒక‌రు కావటం విశేషం. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున హీరోయిన్ రమ్య ఎంపీగా గెలిచారు. 


ఇక ఇదే క్రమంలో సుమలత ఇప్పుడు బిజెపి తమ పార్టీలో చేర్చుకుని ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సుమ‌ల‌త ధైర్య సాహ‌సాలు మెచ్చుకున్న బిజెపి చీప్ అమిత్ షా ప్రశంసించారు. ఇక కన్నడ నాట‌ బిజెపికి మంచి భవిష్యత్తు ఉండడంతోపాటు ఇండిపెండెంట్‌గా గెలిచినా చేయడానికి ఏమీ ఉండదని... అదే బిజెపిలో చేరి కేంద్రమంత్రి అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తోన్న సుమలత ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: