దేశంలో ఎన్నికల ఫలితాలు ఈసారి సునామీని తలపించాయి. మోడీ మళ్ళీ రాడు అని బీజేపీలోనే వరిష్ట నేతలంతా డిసైడైపోయారు. తలపండిన ఓ పెద్దాయన అయితే మోడీ రారు కాక  రారు అనుకున్నారట. ఇక ఆరేస్సెస్  సంగతి చెప్పాలా. మోడీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ కూడా రెడీ చేసి పెట్టుకుందట. మరి ఈసారి మరింత వీర విజ్రుంభణ చేస్తూ మోడీ 303 సీట్లు బీజేపీకి సొంతంగా తీసుకువచ్చారు. ఎన్డీయే సీట్లతో కలుపుకుంటే  353 ఆ కూటమికి దక్కాయి.


దీంతో విపక్షం పూర్తిగా  కకావికలమైంది. ఎవరి నోటా మాట రాలేదు సరికదా గొప్ప  వైరాగ్యం వచ్చేసింది. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరమైన ఓటమి పాలైంది. అక్కడ ఉన్న 40 అసెంబ్లీ సీట్లకు గానూ 39 ఎన్డీయే  కూటమి గెల్చుకుంది. దాంతో ఆ విషయం తెల్సిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఎంతగానే కుమిలిపోయారట. ఏకంగా రెండు రోజుల పాటు అన్నం ముట్టుకుంటే ఒట్టు. ఆయనకు ఉన్న వ్యాధులను ద్రుష్టిలో పెట్టుకుని జైల్ అధికారులు నచ్చచెబితే ఛివరికి నిన్న అన్నం ముద్ద ముట్టుకున్నారు. 


ఇక కాంగ్రెస్ వారసుడు, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే తనకు పార్టీ  పదవే అసలు  వద్దనుకున్నారు. సీడబ్ల్యూసీ మీట్లో వాడిగా వేడిగా జరిగిన చర్చల్లో రాహుల్ తాను పార్టీకి కార్యకర్తగా పనిచేస్తాను, తనకు పార్టీ ప్రెసిడెంట్ పదవి వద్దంటే వద్దు అని చెప్పేశాడట. ఇక చెల్లెలు  ప్రియాంక కూడా పదవి తీసుకోకూడదని షరతు పెట్టాడు. తాను మాత్రం పగ్గాలు మోయలేనని రాహుల్  ఖండితంగా చెప్పినట్లుగా న్యూస్ వచ్చింది.



ఇక మమతా బెనర్జీ అయితే మూడు రోజుల పాటు బయటకే రాలేదు, మాయావతి కూడా ఇపుడే మెల్లగా మాట్లాడుతున్నారు. అఖిలేష్ సంగతి చెప్పనవసరం లేదు. మౌనం దాల్చారు. కేజ్రీవాలాలు,  శరద్ పవార్లూ, ఫరూఖ్  అబ్దుల్లాలూ   అస్సలు  సౌండ్ చేయడంలేదు. మరి ఏపీ విషయానికి వస్తే మోడీకి ధీటుగా ఇక్కడ జగన్ సునామీ నడిచింది. దెబ్బకు యాభై శాతం ఓట్ల షేర్ తో పాటు, 151 సీట్లను కైవశం చేసుకుని టీడీపీ మైండ్ బ్లాంక్ చేశాడు


జగన్. దేశమంతా తిరిగి మనదే విజయం అని చెప్పుకున్న చంద్రబాబు అక్కడా ఇక్కడా ఫలితాలు చూసి ఎలాటి రియాక్షన్ ఇచ్చి ఉంటారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. బాబు గారు అయితే మీడియా ముందుకు రావడమేలేదు. ఇది నిజంగా షాకింగ్ పరిణామం. మరి ఇంట్లో ఆయన కూడా భోజనం మానేశారా, లేక టీడీపీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా అంటున్నారా అన్నది ఇంకా తేలాల్సివుంది. మొత్తానికి మే 23  డేట్  విపక్షాలను ఒక్కలా ఉండనీయలేదుగా. 


మరింత సమాచారం తెలుసుకోండి: