ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం సర్కారు పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చి పట్టుమని వారం రోజులు కూడా కానే లేదు. ఆంధ్రప్రదే్శ్ చరిత్రలో ఎన్నడూ ఎవరికీ జరగనంత పరాభవం తెలుగుదేశం సర్కారుకు జరిగింది. అయితే జనం ఇంతగా వ్యతిరేకత వ్యక్తం చేసినా.. తెలుగుదేశం వైఖరి మారలేదన్న అనుమానం కలుగుతోంది. 


రాష్ట్రంలో కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి. వాటిలో అధికార పార్తీ తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటుంది. ఇది సంప్రదాయంగా వస్తున్నదే. అధికారం మారగానే ఆయనా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు సాధారణంగా రాజీనామా చేస్తుంటారు. 

తిరుమల తిరుపతి పాలక మండలిలో కూడా అదే జరగాల్సి ఉంది. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం.. మా పార్టీ ఓడినా సరే.. అనైతిక చర్యలే మాకు ప్రధానం అంటున్నారు. అధికారం కోల్పోయిన తరవాత పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి ఆర్థికంగా లాభించే నిర్ణయీలు తీసుకుని ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంటేనే పవిత్రమైన పదవులకు నెలవు. అలాంటి పదవుల్లో ఉంటూ స్వామివారి చెంతన ఉండే అదృష్టం దక్కినవారు.. ఇలా కక్కుర్తి పడుతూ పాలక మండలి సమావేశం నిర్వహించడం వైసీపీ నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకే ఈ మీటింగ్ కు వెళ్లవద్దని ఈవోకు సూచిస్తున్నారు వైసీపీ నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: