తెలుగుదేశంపార్టీ శాసనసభా పక్ష నేతగా ఎవరుంటారు ? అనే డ్రామాకు తెరపడింది. ఇంకెవరుంటారు మళ్ళీ చంద్రబాబునాయుడే టిడిఎల్పీగా ఎన్నికయ్యారు. టిడిఎల్పీ నేతగా ఎవరుండాలి అనే విషయమై ఈరోజు చంద్రబాబు ఆధ్వర్యంలో ఎంఎల్ఏల సమావేశం జరిగింది.

 

ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత మూడు రోజులకు తాను టిడిఎల్పీ లీడర్ గా ఉండలేనని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా లీకులు బయటకు వచ్చాయి. దాంతో గెలిచిన ఎంఎల్ఏల్లో ఎవరికి వారుగా నాయకత్వానికి రెడీ అయిపోయారు. అందులో బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు ముందు వరసలో ఉన్నారు.

 

అయితే హఠాత్తుగా మంగళవారం తనను కలసిన నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ టిడిఎల్పీ నేతగా తానే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చారట. ఇంతకీ విషయం ఏమిటంటే టిడిఎల్పీ నేతగా ఉండాలని లేదని చంద్రబాబు అంటే అందరూ వచ్చి తననే ఉండాలని బ్రతిమలాడుకుంటారనో లేకపోతే ఒత్తిడి తెస్తారనో అనుకుని ఉంటారు. అందుకే ఆ రకంగా ఫీలర్లు వదిలారు.

 

అయితే చంద్రబాబు ఒకరకంగా అనుకుంటే ఇంకోరకంగా జరిగింది. టిడిఎల్పీ నాయకత్వ బాధ్యతలు ఇంకోరికి అప్పగిస్తే అసెంబ్లీలో తాను జస్ట్ ఓ ఎంఎల్ఏగా మాత్రమే మిగిలిపోతానని అర్ధమైనట్లుంది చంద్రబాబుకు. అందుకే మళ్ళీ యూ టర్న్ తీసుకుని తానే శాసనసభా పక్ష నేతగా ఉంటానని మళ్ళీ ఫీలర్లు ఇప్పించుకున్నారు. దాంతో ఎంఎల్ఏలందరూ నోరు మూసుకుని మళ్ళీ చంద్రబాబునే ఎన్నుకున్నారు. దాంతో ఐదు రోజుల టిడిఎల్పీ డ్రామాకు తెరపడింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: