రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు వచ్చారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో తాము కొనసాగుతున్న విషయాన్ని గుర్తించి కొంతమంది సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తమను ప్రజలు నమ్మ ఎన్నుకున్నారు కనుక వారికి తమ వంతు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు సినీ నటులు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారి పద్దతులు కూడా చాలా మార్పులు రావడం సహజం..కట్టుబొట్టు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. 


తాజాగా తాము ఎంపీ పొజీషన్లో ఉన్నామన్న సంగతి మరచి మోడ్రన్ దుస్తులు ధరించి తమ ఐడీ కార్డులో పార్లమెంట్ ముందు పోజులిచ్చారు. అంతేకాదు... తామేదో ఘనకార్యం చేసినట్టు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరా అనకుంటున్నారా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ టికెట్లను సంపాదించుకుని, ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాలీ నటీమణులు మిమి చక్రవర్తి, సుస్రత్ జహాన్. 

తమ ఘనకార్యం కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దేవాలయంలా అత్యంత పవిత్రంగా భారత ప్రజలు భావించే పార్లమెంట్ కు పాశ్చాత్య దుస్తులు ధరించి వెళ్లారు.వారు తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాధ్యతగల ఎంపీలు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు తిట్ల దండకాన్ని అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: