ఈ మద్య జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీడీపీ అత్యంత దారుణమైన రిజల్ట్ తెచ్చుకుంది.  మొన్నటి వరకు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ 175 కి 150 సీట్లు గెల్చుకొని భారీ మెజార్టీతో విజయదుంధుబి మోగించింది.   బుధవారం టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.


మరోవైపు జగన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన తెదేపా బృందం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనుంది.  ఇక తెదేపా తరఫున జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, గంటా శ్రీనివాసరావు రేపు జగన్‌ ఇంటికి వెళ్లి కలవనున్నారు. ఈ నెల 23 న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెల్చుకుంది టీడీపీ. 


ఇక పార్లమెంట్ స్థానాలు కేవలం 3మాత్రమే సాధించుకున్నారు.  తాజాగా ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో అడుగుపెట్టనుండగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ను ఎన్నుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: