తెలుగుదేశంపార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబునాయుడు మళ్ళీ పదవి తీసుకోవటం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో వైసిపిని రెచ్చగొట్టటం ద్వారా అవమానాలు ఎదురయ్యేట్లు చేసుకోవటమే టిడిపి ఉద్దేశ్యంగా కనబడుతోంది. అసెంబ్లీలో తనను వైసిపి అవమానిస్తోందని ఆరోపించి జనాల్లోకి వెళ్ళిపోయి సింపతి గెయిన్ చేయాలన్న వ్యూహంతోనే చంద్రబాబు మళ్ళీ టిడిఎల్పీ నేత పదవిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీకి వచ్చిన సీట్లను చూసుకుని టిడిఎల్పీ నేతగా ఉండటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదని లీకులు వదిలారు. 23 మంది ఎంఎల్ఏలను పెట్టుకుని అసెంబ్లీకి వెళితే తనను వైసిపి సభ్యులు అవమానిస్తారని చంద్రబాబు భయపడ్డారు.

 

ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, వైసిపి ఎంఎల్ఏలను ఐదేళ్ళ పాటు అసెంబ్లీలో ఎన్ని అవమానాలకు గురిచేసింది బహుశా చంద్రబాబు అండ్ కో కు గుర్తుకొస్తున్నట్లుంది. అందుకే అంతకుమించిన అవమానాలు తమకు ఎదురవుతాయని ఇపుడు చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ కు ఇవ్వాల్సిన మర్యాదలు ఇచ్చుంటే టిడిపికి ఇపుడీ టెన్షన్  ఉండేది కాదు.

 

అందుకే కొద్దిరోజులు టిడిఎల్పీ నేతగా బాధ్యతలు తీసుకునే విషయంలో చంద్రబాబు వెనకాడరాట. మొత్తానికి కారణాలేవైనా మళ్ళీ తానే శాసనసభా పక్ష నేతగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడే చంద్రబాబు నిర్ణయం వెనుక పెద్ద వ్యూహం ఉందంటున్నారు.

 

రేపటి అసెంబ్లీలో వైసిపి సభ్యుల నుండి అవమానాలు తప్పవని నిర్ధారణకు వచ్చేశారు చంద్రబాబు అండ్ కో.  చంద్రబాబు కోరుకుంటున్నది కూడా అదేలాగుంది. అసెంబ్లీలో అవమానాకు గురై లేకపోతే ఆ పరిస్ధితులను చంద్రబాబే కల్పించుకునేట్లున్నారు. తనను వైసిపి కావాలనే అవమానిస్తోందని జనాల్లోకి వెళ్ళిపోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది చూస్తుంటే.

 

అవమానం పేరుతో జనాల్లోకి వెళ్ళిపోయి సింపతి గెయిన్ చేయాలన్న ఆలోచనలో టిడిపి ఉన్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే తమకు అవమానాలు ఎదురవుతాయని భయపడటం లేదని పయ్యావుల కేశవ్ ఎందుకంటారు ?  తామెప్పుడు వైసిపి సభ్యులను అవమానించలేదని అడ్డంగా అబద్దాలు ఎందుకు చెబుతారు ? వైసిపి సభ్యులను టిడిపి అవమానించిందా లేదా అనేది గడచిన ఐదేళ్ళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: