ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే తన పనులు మొదలు పెట్టారు.  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా నెరవేరాలంటే అన్నింటా ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆయన మొదటి నుంచి అంటున్న మాటే..ఈ నేపథ్యంలో కొంత మంది ఐఏఎస్ అధికారుల బదీలీలు..మరికొంత మంది ఐఏఎస్ ల నియామకాలు చేయడం విశేషం.  తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం మొట్టమొదటి జీవో అమల్లోకి తీసుకు వచ్చింది.  


నేడు మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చారు..నేను ఉన్నానని..రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని..ఇందుకు అందరి సహయ సహకారాలు కావాలని అన్నారు. 


ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లినా ఆయా పరిధిలోని అధికారులను నిర్మోహమాటంగా నిలదీయాలని..అయినా స్పందించకుండా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. ఇలా వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా అప్పుడే దూకుడు పెంచారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: