నియంతృత్వ రాజ్యమది. నోరు తెరిచి అడిగే పరిస్థితులుండవు. ఉత్తర కొరియాలో ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజల ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రం. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా దిక్కులేని పరిస్థితి. అక్కడ కిమ్‌ ప్రభుత్వం ఆదుకోకపోగా మరింత వేధిస్తుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఉత్తర కొరియాలో నెలకొన్న పరిస్థితులపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 

Related image

*ఉత్తరకొరియా అవినీతితో నిండిపోయిందని, 
*అణచివేత సాధారణమని యూఎన్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 
*శిక్షిస్తామని, జైల్లో పెడతామని బెదిరించి కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజల నుంచి కూడా అక్కడి అధికారులు దోపిడి చేస్తున్నారని తెలిపింది. 
Image result for un report on north korea human rights

"ది ప్రైస్‌ ఈజ్‌ రైట్స్‌" పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక పేదరికం, అవినీతి, అణచివేతల వలలో చిక్కుకున్న ప్రజలు విలవిల్లాడిపోతున్నారని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అక్కడ పది మిలియన్ల మంది ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. అత్యంత దుర్భరమైన కరువు నేపథ్యంలో ప్రజలపై మరిన్ని ఆంక్షలుపెట్టే అవకాశముందని ఐఖ్య రాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది.


దేశ జనాభాలో నాల్గింట మూడొంతుల మంది బ్లాక్‌-మార్కెట్‌ లో సరుకులు కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగైనా కడుపునిండా తినే పరిస్థితి లేదు. జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేయక తప్పదు. అయితే అలా పని చేస్తున్నందుకు కూడా అధికారులకు లంచం చెల్లించాల్సిందేనని ఆ నివేదిక చెబుతుంది. 214 మందిని ఇంటర్వ్యూ చేసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఈ నివేదిక రూపొందించింది.
Image result for un report on north korea human rights
ప్రజలు పడుతున్న కష్టాల గురించి 'అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం' రూపొందించిన నివేదికను ఉత్తర కొరియా తోసిపుచ్చింది. రాజకీయంగా ప్రభావితమై ఈ నివేదిక తయారు చేశారని ఆరోపించింది. వారికి అవసరమైన నిధులు పొందేందుకు కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఇలాంటి రిపోర్టులు తయారు చేస్తారని తన ప్రకటన విడుదల చేసింది ఉత్తర కొరియా. 

Image result for un human rights commission

మరింత సమాచారం తెలుసుకోండి: