*వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 65 ఏళ్ల నుండి 60 కు కుదింపు
 *విభిన్న ప్రతిభావంతుల కు ఇప్పటి వరకూ ఉన్న రెండు(2)కేటగిరీ లను తొలగించి అందరినీ ఒకే కేటగిరీలో చేర్చి 3000/-అందరికీ ఓకేలాగా వర్తింపచేయడం
 *డయాలసిస్ రోగులకు ఇప్పటి వరకూ ఇస్తున్న 3,500/-పింఛన్ ను 10,000/-(పది వేలు)కు పెంచుతూ ఉత్తర్వులు జారీ
 *జూన్ నెల నుండి పెంపు వర్తింపు
  *మే నెల పింఛన్ జూన్ 1 నుండి అన్ని గ్రామాల్లో పంపిణీకి పేదరిక నిర్మూలనా సంస్థ సన్నద్ధం
  *జూన్ నెల నుండి పెంచిన పింఛన్ జులై 1 నుండి పెంచిన మొత్తం కలిపి పంపిణీ చేస్తారు
  *నవరత్నాల్లో ఇచ్చిన పింఛన్ హామీ అమలు ఉత్తర్వులు పై ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారి తొలి సంతకం
  *వయోవృద్ధులకు
  *వితంతువులకు
  *గీత కార్మికులకు
  *మత్సకారుల కు
  *ఒంటరి మహిళలకు....2,250/-
చప్పున జూన్ నెల నుండి అందజేసే క్రమంలో ఉత్తర్వులు జారీ
  ఇప్పటి వరకూ గడిచిన నెల పింఛను మరుసటి నెల మొదటి తారీకు నుండి అందిస్తున్నారు..
  అంటే గడిచిన మే నెల పింఛను ఈ జూన్ 1 వ తారీకు నుండి అందుతుంది
  పెంచిన పింఛను జూన్ నుండి వర్తిస్తుంది కాబట్టి జులై 1 వ తారీకు నుండి పెంచిన మొత్తం కలిపి అందుతుంది...
  ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలి ప్రాధాన్యతను వయోవృద్ధులకు మరియు ఈ విభాగాల్లో పింఛన్ పొందుతున్న నిరుపేదలకు ఇచ్చారు...
పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్)ఈ మేరకు ముఖ్యమంత్రి నుండి అందిన ఆదేశాల ప్రకారం తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారం అవగాహన కోసం


మరింత సమాచారం తెలుసుకోండి: