తెలుగుదేశంపార్టీని భూస్ధాపితం చేసేంత వరకూ జగన్మోహన్ రెడ్డి విశ్రమించేట్లు కనబడటం లేదు. ఎందుకంటే వైసిపి అఖండ విజయం సాధించిన తర్వాత జగన్ చెప్పిన మాటలతో అందరికీ టార్గెట్ ఏమిటో చెప్పకనే అర్ధమైపోతోంది. మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపి మాడు పగలగొట్టారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా 23 ఎంఎల్ఏలు, 3 ఎంపి సీట్లలో మాత్రం గెలిచింది.

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు, ఎంఎల్ఏలతో జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ 2024 టార్గెట్ గా అందరూ పనిచేయాలని స్పష్టంగా ఆదేశించారట.

 

2019 ఎన్నికల్లో గెలవటం తన టార్గెట్ కాదని 2024 ఎన్నికల్లో ఇంతకు మించిన అఖండ విజయం సాధించాలని చెప్పారట. అందుకు తగ్గట్లుగానే తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయనున్నట్లు వివరించారట. తనకు డబ్బులు సంపాదించటంపై ఆశ లేదన్నారు. ఇమేజి కాపాడుకోవటం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే తన పాలన ఉంటుందని స్పష్టం చేశారట.

 

ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా అనవసరమైన ఆబ్లిగేషన్లు తన వద్దకు తేవద్దని స్పష్టం చేశారట. ఏ పనిచేసినా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పని చేయాలని అందరికీ తన లక్ష్యాలేంటో వివరించి చెప్పారు. దాంతో 2024 ఎన్నికలకు సంబంధించి జగన్ మనసులో ఇప్పటి నుండే స్పష్టమైన ఆలోచనలు, ప్రణాళిక ఉన్నట్లు అందరికీ అర్ధమైపోయింది. చూడబోతే 2024 ఎన్నికల్లో టిడిపికి ఇపుడున్న సీట్లు కూడా రానిచ్చేట్లు లేడు జగన్. అంటూ టిడిపి భూస్ధాపితమే లక్ష్యంగా జగన్ పనిచేయబోతున్నట్లు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: