వామ్మో..వామ్మో..ఈ ఎల్లో మీడియా కామెడీ చూస్తే మీరు పడి పడీ నవ్వుతారు. ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో చంద్రబాబు స్వయంకృతాపరాథమే కాకుండా ఎల్లో మీడియా కూడా తన వంతు పాత్ర పోషించింది. అసలు బాబుగారికి, ఆయన పుత్రరత్నం లోకేషానికి ఎల్లో మీడియా ఎంత జాకీలు వేసి లేపాలని చూసినా, జగన్ వస్తే రాజధాని తరలిపోతుంది..అరాచకం రాజ్యమేలుతుందని ఎంత విషం కక్కినా..ప్రజలు నమ్మలేదు. జగన్ విశ్వసనీయతకే ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పారు. ఓటమి తర్వాత అయినా చంద్రబాబులో మార్పు వస్తుందేమో, ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ఆశిస్తే..బాబుగారిలో పెద్దగా మార్పేం లేదని తాజాగా ఉండవల్లిలో జరుగుతున్న డ్రామాలు చూస్తే తెలుస్తుంది.


అసలు మా బాబుగారి లాంటి తోపు, ప్రధాని కావల్సిన నాయకుడు ఓడిపోవడమేంటి..అంతా ఈవీయంల మాయ అంటూ ఎన్నికల ఫలితాల రోజు కాసేపు గగ్గోలు పెట్టిన ఎల్లోమీడియా తర్వాత ప్రజలు ఛీ...కొడతారని ఆగిపోయింది. అయితే బాబుగారు లేకపోవడం వల్ల ప్రజలు అన్యాయమైపోయారంటూ, ఇక ఏపీకి దిక్కు ఎవరు అన్న లెవల్లో టీడీపీ, ఎల్లోమీడియా కలిపి ఉండవల్లిలో ఓదార్పు యాత్రలు డ్రామాలు మొదలెట్టాయి. రెండు రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి " నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా? అనే టైటిల్‌తో ఓ కథనం ప్రచురిచింది.


కావాలంటే మీరు ఈ కథనాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈపేపర్‌‌లో కాని, వెబ్‌సైట్‌లో కానీ చూడండి..ఆ కథనం ప్రకారం... గుంటూరు, విశాఖజిల్లాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో బుధవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి తరలివచ్చారని, వారంతా చంద్రబాబును చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు అంటూ ఆంధ్రజ్యోతి కూడా వాళ్లతో పాటు కన్నీళ్లు కార్చింది. ఇక బాబుగారి దగ్గరకు వచ్చిన వాళ్ల ఆవేదన వారి మాటల్లోనే.. అంటూ సెంటిమెంట్ సిన్మా డైలాగులు రాసుకొచ్చింది..అబ్బబ్బా..ఒక్కసారి ఆ కథనం చదివితే దేవుడు లాంటి మా బాబుగారిని ఎందుకు ఓడించామో అని మీరు కూడా నాలుగు బొట్లు కన్నీళ్లు కార్చడం ఖాయం..అసలు ఆ సెంటిమెంట్ కహానీ ఏంటీ మీరే చూడండి..


‘నీ వెంటే మేమన్నా.. నీ కోసమే వందల కిలోమీటర్ల నుంచి వచ్చామన్నా.. ఇంత కష్టపడినా ఓడిపోయామనేదే మా అందరి బాధన్నా.. మాలాంటి లేనివాళ్లు ఎందరికో ఇళ్లు ఇచ్చావన్నా.. నెలవారీ పింఛన్లు ఇచ్చావయ్యా.. నువ్వు చేయని ఏమీ లేదయ్యా..? అయినా ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాం..పేదలకు ఇన్ని చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా..? ఎక్కడో.. ఏదో జరిగిందయ్యా.. ఇదంతా ఏదో మాయగా ఉందయ్యా.. ఇది మేమిచ్చిన తీర్పు కాదయ్యా.. మిషన్లు ఇచ్చిన తీర్పు అయ్యా.. ఎప్పుడూ పని పని అని పరితపించావయ్యా.. పనిచేసే వాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా? ఏదో మాయ జరిగిందయ్యా.." అంటూ వచ్చిన వాళ్లు బాబుగారి దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారంట..వామ్మో ముత్యాల సుబ్బయ్య కనుక ఈ సీన్ చూస్తే మళ్లీ కెమెరా పట్టి ఓ సెంటిమెంట్ సిన్మా తీసేవాళ్లు. 


ఇక తనను పరామార్శించిన వాళ్లనుచూసి చంద్రబాబు చలించిపోయారంట... ‘మళ్లీ మంచి రోజులు వస్తాయి. అందరూ ధైర్యంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి’ అని ధైర్యం చెప్పి వారందరినీ ఊరడించారంట. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వేటుకూరి శివరామరాజు, కొండబాబు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కృష్ణాజిల్లా తెలుగుమహిళ నేత ఆచంట సునీత తదితరులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ అద్భుతమైన సెంటిమెంటల్ కథనం ప్రచురించింది...ఓటమిని హుందాగా ఒప్పుకుని ఓ ఏడాది పాటు సైలెంట్‌గా ఉండక బాబుగారికి ఎందుకు వచ్చిన తిప్పలు..ఏదో ఇంట్లో ఎవరో చనిపోయినట్లు ఆ ఓదార్పులు ఏంటీ...ఆ కన్నీళ్లు ఏంటీ..ఓరి నాయనో..టీడీపీ ఓటమిలో మా తప్పేం లేదు..ప్రజల తప్పేంలేదు..ప్రజలు మా బాబుగారికే ఓటేశారు.


కానీ ఆ మోదీ, జగన్, కేసీఆర్‌లు కుట్రలు చేసి ఈవీయంలు ట్యాంపరింగ్ చేసి మా బాబుగారిని ఓడించారు అని ఎల్లోమీడియా బాధ..అందుకే టీడీపీ నాయకులు ఓదార్పు యాత్రలు మొదలుపెడితే ఎల్లోమీడియా కూడా తనవంతుగా సెంటిమెంటల్ కథనాలు వడ్డించి..బాబుగారు దేవుడు..ఈవీయంలే ఓడించాయని గోబెల్ ప్రచారం చేస్తోంది...ఛీఛీ..ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా..బాబుమారడు..ఈ ఎల్లో మీడియా మారదు..


చివరగా ఈ ఓదార్పు యాత్రలలో కొసమెరుపు ఏంటంటే..బాబుగారి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులకు రోజుకు ఇంత మందిని మహిళలను, వివిధ వర్గాల ప్రజలను చంద్రబాబు నివాసానికి తీసుకురావాలని పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో చేసేదేమి లేక స్థానిక టీడీపీ నాయకులు మహిళలను, రైతులను, విద్యార్థులను ఇలా వివిధ వర్గాల వారిని బతిమాలుకుని, డబ్బులిస్తామని చెప్పి ఉండవల్లిలోని బాబుగారికి ఇంటికి తీసుకువస్తున్నారు. బాబుగారి దగ్గర ఓదార్పు డ్రామా అయిపోయాక వచ్చిన వ్యక్తులకు కొంత మొత్తం చేతిలోపెట్టి పంపిస్తున్నారు.


అయితే ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టి ఓడిపోయిన బాధలో ఉంటే మళ్లీ బాబుగారి ఓదార్పు యాత్రల పేరుతో మళ్లీ ఈ ఖర్చే ఏంట్రా అని టీడీపీ నాయకులు నెత్తీ, నోరు బాదుకుంటున్నారు. అయినా జనాలు ఎంత బుద్ధి చెప్పినా..చంద్రబాబు మారుతాడా...ఎల్లోమీడియా మారుతుందా..అంతా మన పిచ్చికానీ..ఓటమి బాధ మర్చిపోయేదాకా బాబుగారి ఓదార్పు యాత్రలు, ఎల్లోమీడియా సెంటిమెంటల్ కథనాలను మనం చూస్తూనే ఉండాలి..అంతా మన ఖర్మ..



మరింత సమాచారం తెలుసుకోండి: