ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.  ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు పదవిలోకి వచ్చారు.  అప్పట్లో కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన విషయం తెలిసిందే. 


తాజాగా కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పునఃప్రతిష్టించాలని కోరుతూ విగ్రహం పున ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కమిటీ సభ్యులు కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ధర్నా కు దిగారు.


ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం విగ్రహాన్ని అన్యాయంగా తొలగించారు. విగ్రహాలను తొలగించారు కానీ ప్రజల మనసుల్లో నుంచి వైఎస్ ను తొలగించలేకపోయారు.  కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కమిటీ సభ్యుల వినతి...


మరింత సమాచారం తెలుసుకోండి: