చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. సిబిఐ విచారణకు జగన్ అనుమతిస్తు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరగకుండా గతంలో చంద్రబాబు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని జగన్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

 

అవినీతి ఆరోపణలపై విచారణకు సిబిఐకి జగన్ ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే ముందుగా ఇబ్బంది పడేది తెలుగుదేశంపార్టీ నేతలే అన్న విషయంలో అనుమానం లేదు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో అనేకమంది టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు దోచేసుకున్నారు. ఇసుక, మట్టి, నీరు, భూమి అన్న తేడా లేకుండా ఎవరికి అవకాశం ఉన్నచోట అవకాశం వచ్చినట్లుగా దోచేసుకున్నారు.

 

తమ నేతలపై సిబిఐ ఎక్కడ దాడులు చేస్తుందో,  కేసులు పెడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు కన్సెంట్ ను రద్దు చేశారు. ఇపుడా కన్సెంట్ రద్దును రద్దు చేస్తు ఓ సవరణ తీసుకురావాలని జగన్ నిర్ణయించారు. దాంతో ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ సిబిఐ ఎంట్రీకి కన్సెంట్ రాబోతోంది.

 

జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో టిడిపి నేతలకు  చెమటలు పడుతోంది. నిజంగానే టిడిపి నేతల అవినీతిపై సిబిఐ దాడులు మొదలుపెడితే పనిలో పనిగా చంద్రబాబు, చినబాబు మీద దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఉన్న కేసులతో చంద్రబాబు సతమతమవుతున్నారు. దానికి తోడు కొత్తగా సిబిఐ దాడులు, కేసులంటే ఇక చెప్పాల్సిన పనేలేదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: