ఏపి సీఎంగా జగన్ దూకుడు పెంచారు..ఈ నేపథ్యంలో ఆయన సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 


ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా ఆయన ప్రతి గ్రామం సందర్శించి అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ గురించి క్షణ్ణంగా తెలుసుకున్ననేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఏపిలో విద్యాభివృద్ది జరిగితేనే ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని గట్టి నమ్మకంగా ఉన్నారు సీఎం జగన్.  


 మొదటి నుంచి ఆయన ఏపి ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయాలన్న జగన్.. ఇకపై అక్కడి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: