అవును ఆ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పేశారు. బిబిసికిచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ తనకు డబ్బు మీద ఆశకానీ, సంపాదించాలన్న కోరిక కానీ లేదని స్పష్టంగా ప్రకటించారు. తన ఆలోచనంతా రాష్ట్రాభివృద్ధి మీదనే నిలిచినట్లు చెప్పారు.

 

పాదయాత్ర సందర్భంగా తానిచ్చిన నవరత్నాల పథకాలను అమలు చేయటానికి తన దగ్గర ప్రణాళిక ఉందన్నారు. అదేమిటో తొందరలోనే అందరికీ అర్ధమవుతుందన్నారు. నవరత్నాలను అమలు చేయటానికి అవసరమైన రూ 56 వేల కోట్లను ఎలా సమీకరిస్తానో అందరు చూస్తారంటూ ధీమాగా వ్యక్తం చేశారు.

 

తన లక్ష్యాలను చేరుకోవటానికి కార్పొరేట్ తరహా పరిపాలన విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ తరహా పాలనంటే చంద్రబాబు తరహా పాలన కాదులేండి. కార్పొరేట్ సంస్ధల్లో ప్రతీ పనికి నిర్దిష్ట గడువు పెట్టుకుని పూర్తి చేస్తున్నట్లే తాను కూడా అలాంటి విధానాన్నే అవలంభించనున్నట్లు జగన్ చెప్పారు.

 

బాధ్యతలు తీసుకున్న ఆరు మాసాల నుండి ఏడిదిలోగా మంచి సిఎంగా పేరు తెచ్చుకుంటానని బహిరంగంగా ప్రకటించిన విషయం గుర్తే కదా ? అందుకు తగ్గట్లే పాలనను, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు మంచి టీమ్ ను తీసుకుంటున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: