తెలంగాణ ఉద్యమం నేతగా ప్రజల మనసు దోచుకున్న కల్వకుంట్ల కేసీఆర్..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాలుగున్నర సంవత్సరాలు సుస్థిర పాలన చేసిన ఆయన మరోసారి తెలంగాణ ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది.  ఈ నేపథ్యంలో రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టారు. 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు  తీపి కబురు అందించింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది.  దీని  ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెరగనుంది.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం పెంచుతూ ఉత్తర్వులు. 


డీఏ పెంచడంతో తెలంగాణ ఉద్యోగుల మూల వేతనం  30.392 శాతానికి చేరింది. పెరిగిన డీఏను జూలై 2018 నుంచి మే 2018 వరకు జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది.  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: