ఈ రోజుల్లో పెండ్లి వయసు వచ్చిన అమ్మాయిని తండ్రి అడిగాడు నీకు ఎటువంటి అబ్బాయిని చూడమంటావు అని దానికి ఆ అమ్మాయి నాకు అ నుండి అః వరకు అర్హత వున్న అబ్బాయి కావాలి అని చెప్పింది అంటే అని తండ్రి అడుగగా ఈక్రింది విధంగా సమాధానం చెప్పింది చూడండి...
అ.....అమ్మా-నాన్నలకు దూరంగా ఉండాలి
ఆ.....ఆస్తి-పాస్తులు పుష్కలంగా ఉండాలి.
ఇ......ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి.
ఈ.....ఈతరం యువకుడుగా ఉండాలి.
ఉ......ఉన్నతస్ధాయి స్నేహితులు ఉండాలి.
ఊ.....ఊరూర్లూ-విదేశీయానాలు తిప్పాలి.
ఎ.......ఎర్రగా-బుర్రగా ఉండాలి.
ఏ.......ఏకైక సంతానమై ఉండాలి.
ఐ.......ఐనవాళ్ళను లిమిట్స్ లో ఉంచాలి.
ఒ.......ఒడ్డూ-పొడుగూ బాగుండాలి.
ఓ.......ఓర్పుతో నా ఆజ్ఞలు పాటించాలి.
ఔ...... ఔషధాల జోలికిపోని ఆరోగ్యవంతుడవ్వాలి.
అం....అంతులేని ప్రేమను నాకే పంచేవాడవ్వాలి.
అః ... అఃతకరణ శుద్ధి తో చూసుకోవాలి.
అలా ఉంది.. నేటి అమ్మాయిల పరిస్థితి.