మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన కంచుకోట అమేధీలో ఓడిపోవడం సంచలంగా మారింది. ఆయన ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాస్త ముందుచూపుతో కేరళలోనూ పోటీ చేయబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే.. రాహుల్ గాంధీ లోక్ సభలో అడుగు పెట్టే అవకాశం కోల్పోయారు. 


కానీ రాహుల్ అమెధీలో ఎందుకు ఓడారు. అమేధీ ఇందిరాగాంధీ కాలం నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోట. అక్కడ ఆ పార్టీకి ఓటమి లేదు. కానీ ఈసారి ఎందుకు ఓడారు. అప్పటికీ రాహుల్ కు వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ కూటమి పోటీ కూడా పెట్టలేదు. ఈ అనుమానమే సోనియా గాంధీకి వచ్చింది. 

ఆమె కొడుకు పరాజయం గురించి నివేదిక తెప్పించుకుంది. దాని ప్రకారం రాహుల్ ఓటమికి కారణం.. ఎస్పీ, బీఎస్పీకి చెందిన స్థానిక నేతలేనట. వారు రాహుల్ కు ఏమాత్రం సహకరించలేదట. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమిలో కాంగ్రెస్‌ భాగస్వామి కాదు. కానీ ముందస్తు అవగాహనతో పోటీకి దింపలేదు. 

పోటీ చేయకపోయినా.. ఎస్పీ, బీఎస్పీ నేతలు బీజేపీకే సహకరించారట. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడిందట. వారు కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టనప్పటికీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడి విజయానికి సహకరించలేదట. అదన్నమాట రాహుల్ పరాజయానికి అసలు కారణం. 


మరింత సమాచారం తెలుసుకోండి: