తమన్నా ఇండస్ట్రీకొచ్చి ఇప్పటికే పదేళ్లు దాటిపోయినాయి. అయినా అవకాశాలను ఇంకా కొల్లగొడుతూనే ఉంది. అయితే   తమన్నా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.. ఫ్లాపులూ ఉన్నాయి.  అందరూ ఆమె మేనిరంగుకు.. అందానికి ఫిదా అయి పెట్టుకున్న ముద్దు పేరు మిల్కీ బ్యూటీ.  తమన్నా ఫేడ్ అవుట్ అయిందని గుసగుసలు వినిపించడం.. అంతలోపు ఒక భారీ హిట్ సాధించి ఫామ్ లోకి రావడం తమన్నాకు చాలా కామన్ అయిపోయింది. 


వరసగా ఫెయిల్యూర్లు అని విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో 'ఎఫ్ 2' తో ఫుల్ ఫామ్ లోకి వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఇదిలా ఉంటే తమన్నా సోషల్ మీడియాలో యమా యాక్టివ్.  రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ పంచుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి తన మనసుకు నచ్చిన కవిత రాసి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. మరోసారి హాట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా మరోసారి ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.


ఈ ఫోటో షూట్ ప్రత్యేకత తెలుసా..? జీక్యూ 100 బెస్ట్ డ్రెస్డ్ కార్యక్రమానికి హాజరైంది. ఆ కార్యక్రమం కోసమే ఈ డ్రెస్.. ఫోటో షూట్.  ఆ ఫోటోలను ఇన్స్టా లో అభిమానులతో పంచుకుంది. దీనికి తమన్నా "ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేకమైన రెడ్ షేడ్ ఉంటుంది-ఆడ్రీ హెప్ బర్న్ #జీక్యూ 100 బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.తమన్నా రెడ్ కలర్ లెదర్ జాకెట్ ధరించి ఎంతో స్టైల్ గా పోజులిచ్చింది. ఎత్తైన హీల్స్ ధరించి.. లూజ్ హెయిర్ తో.. మ్యాచింగ్ లిప్ స్టిక్ తో మోడరన్ భామలా మెరిసిపోయింది. ఈ ఫోటోలకు ఇన్స్టా లో భారీ రెస్పాన్స్ వచ్చింది. "రెడ్ హాట్".. "100% రియల్ బ్యూటీ".. "మెస్మరైజింగ్ మిల్కీ బ్యూటీ'..ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: