టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన వైఫల్యం అనంతరం మీడియాకి చాలా దూరంగానే ఉన్నారు. రెండు రోజులు తమ ఓటమిపై పంచనామా నిర్వహించిన బాబు, ఇక చేసేదేముంది అంటూ ఇంట్లోనే గడుపుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలోనే లోకల్ గా ఉంటూ  పార్టీ కార్యక్రమాలకి వెళ్ళక పోయినా, మీడియాకి కనపడక పోయినా బాబు బెంగ పెట్టుకున్నారు అంటూ ఎక్కడ మీడియాలో వార్తలు వస్తాయోనని ఎంచక్కా ఫారిన్ టూర్ ప్లాన్ చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గాను చంద్రబాబు ఈ నెల 7న కుటుంభ సమేతంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అయితే

 Image result for chandrababu foreign tour

చంద్రబాబు ఎప్పుడు విదేశాలకి వెళ్ళిన టూర్ షెడ్యూల్ మాత్రం ముందుగానే రిలీవ్ అయ్యేది కాని ఈ సారి మాత్రం చంద్రబాబు షెడ్యూల్ అత్యంత గోప్యంగా ఉంచారు. అధికారంలో లేననే భావనతోనో లేక మరేదన్నా కారంతో ఉందొ ఏమో కానీ మొత్తానికి బాబు గారి టూర్ సీక్రెట్ అంతా అనేక సందేహాలని కలిగిస్తోంది.అందుకు గాను టీడీపీ నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ , పవన్ లాంటి నేతలు ఫారిన్ టూర్స్ వేశారు కానీ చంద్రబాబు రెస్ట్ తీసుకోలేదు కేంద్రంలో ఉన్న  పార్టీలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి వెళ్తున్నారు అంటూ సర్ది చెప్పుకుంటున్నారు.

 Image result for chandrababu foreign tour

అయితే టీడీపీ నేతలు ఎంతగా సర్ది చెప్పుకున్నా సరే సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు పై పలు రకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై, అవకతవకలపై విచారణ జరిపిస్తా, తప్పులుంటే అంతే సంగతులు అంటూ జగన్ హెచ్చరించడంతో భయపడిన చంద్రబాబు ఫారిన్ టూర్ వంక పెట్టుకుని వెళ్లి పోతున్నారని. కేసుల భయంతో ఇక అక్కడే ఉంది పోతారని ఇప్పటికే సెటైర్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టూర్ విషయంలో గోప్యత ఉంచడం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: