మొన్నటి ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తం 175 సీట్లలో మరీ దారుణంగా జనాలు టిడిపికి 23 ఎంఎల్ఏలను మాత్రం ఇచ్చారు. ఇంతటి ఘోర పరాజయం టిడిపికి గడచిన 36 ఏళ్ళల్లో ఏనాడూ ఎదురుకాలేదు.

 

ఎన్నికల్లో వైసిపి దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే చంద్రబాబునాయుడుతో సహా సీనియర్లు ఎవ్వరూ ఇంత వరకూ మీడియాకు మొహం కూడా చూపలేకపోతున్నారు. ఫలితాలు చూసిన తర్వాత టిడిపి భవిష్యత్తుపై చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబుకు వయసు అయిపోవటం. చినబాబు నారా లోకేష్ సామర్ధ్యం బయటపడిన కారణంగా నేతల్లో ఎక్కువమంది తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు.

 

అందుకే కొందరు నేతలు బిజెపి వైపు చూస్తున్నట్లు సమాచారం. వైసిపిని తట్టుకోవాలంటే ఏదో ఓ పార్టీలో వెంటనే చేరాలి. వైసిపిలో వాళ్ళందరికీ డోర్లు క్లోజైపోయాయి. అందుకే కమలంపార్టీ వైపు చూస్తున్నారట. గుంటూరులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు పేర్లు వినబడుతున్నాయి.  అనంతపురం జిల్లా నుండి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి పేరు వినబడుతోంది.

 

కర్నూలు జిల్లా నుండి టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, ఆయన కొడుకు టిజి భరత్, ఆదోనిలో మాజీ ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు, నంద్యాల, ఆళ్ళగడ్డలో భూమా కుంటుంబం, ఆలూరు నుండి వీరభద్రగౌడ్ పేర్లు బాగా వినబడుతున్నాయి. చివరకు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుండి కూడా కొందరు నేతలు వీలైతే వైసిపిలోకి లేకపోతే బిజెపిలోకి వెళ్ళిపోయేందుకు రెడీ అయిపోతున్నారు. తమకు అందుబాటులో ఉన్న బిజెపి నేతల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చూడబోతే టిడిపి దుకాణాన్ని బిజెపినే బంద్ చేయించేట్లుంది. ఐదేళ్ళు చంద్రబాబు చేసిన పనే ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంటోందంతే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: