ప్రభుత్వం అన్న తర్వాత ప్రతిపక్షాల విమర్శలు ఉండటం సహజం..ఇప్పడు ఏపిలో వైసీపీ పాలన కొనసాగుతుంది.  గత నెల 23న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అఖండ విజయంతో కొత్త రికార్డులే సృష్టించారు.  ఈ నేపథ్యంలో ఆయనపై నమ్మకం ఉంచి తనకు ఇంత విజయాన్ని అందించిన ఏపి ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు.


గత నెల 30 న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ రోజే సంచలన నిర్ణయం తీసుకుంటూ వృద్దాప్య పెన్షన్ పై సంతంక పెట్టారు.  అప్పటి నుంచి ఆయన పలు సంస్కరణలు మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో నిరుద్యోగులని గ్రామ వాలంటీర్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, గ్రామ ప్రజల సేవలకు వాడుకుని సీఎం జగన్   ₹5,000 ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.


అయితే.. ప్రభుత్వానికి పైసా ఉపయోగపడకుండా తిని తొంగునే పరమ పోరంబోకు సన్నాసులకి నిరుద్యోగ భృతి కింద చంద్రం నెలకి ₹2,000 ఇస్తే.. ఆహా... అబ్బా... ఉమ్మా... హుష్... అని హస్కీగా మూలుగుతాయి పచ్చ చేగోడీలు .. అదే నిరుద్యోగులని గ్రామ వాలంటీర్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, గ్రామ ప్రజల సేవలకు వాడుకుని సీఎం జగన్ గారు నెలకి ₹5,000 జీతం ఇస్తే మాత్రం అది పెద్ద నేరం.. ఘోరం.. దుర్మార్గం.. అన్యాయం.. అక్రమం.. అధర్మం.. అంటున్నారు..ఒక పార్టీ వర్గానికి చెందిన వారు. 


అయితే ఇది ఎంత వరకు సమంజసం..పేదల గురించి ఎంతో చేయాలనుకుంటున్న సీఎం జగన్ సంకల్పాన్ని ముందు ముందు చూసి ఇలాంటి చెత్త కామెట్స్ చేస్తే బాగుంటుందని అంటున్నారు వైసీపీ శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: