'పుక్కటికి దొరికితే పినాయిలు కూడా తాగేటోళ్ళు' ఉన్నారు మనలోనే. వాళ్ళకు సిగూఎగ్గూ ఉండదు. వారి స్థాయి ఏదైనా సరే! సభ్యత సంస్కారం ఏమీ ఉండవు. మరీ ప్రజా ధనమైతే మరమరాల్లా బొక్కేస్తారు కొందరు అధికారులు. వాళ్లు ముఖ్యమంత్రు లైనా మంత్రులైనా ఎవరైనా అంతే అని ఈ సంఘటన చూస్తే ఋజువౌతుంది.  


2014 నుండి 2019 వరకు కొనసాగిన టిడిపి ప్రభుత్వ పాలనా కాలంలో  జరిగిన అనేక అక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హనరెడ్డి సమీక్షల్లో అధికారులు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ఆంతా వింటున్న ముఖ్యమంత్రికి తల తిరిగి పోయింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది ఆ సమయానికి. అందుకే ఆయా అంశాలను తన శ్వేతపత్రాల విడుదల సందర్భంగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు వెల్లడిస్తారని సమాచారం. 
Image result for dry fruits images
నిర్వహిస్తున్న వరుస సమీక్షల సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యాశాఖలో సమీక్ష జరపటా నికి సిద్ధమౌతున్న సమయంలో గత బాబు ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యామండలిలో జరిగిన ఒక షకింగ్ కుంభకోణం బయటపడింది.  ఏపీ ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గతమూడేళ్లలో ₹18,00,000/- ఖర్చు పెట్టినట్లు తేలిసింది. ఈ విషయాన్ని అధికారులు ఇవాళ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.



ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధశాఖల్లో చోటుచేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధిక శాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగానే ఏపీ ఉన‌్నత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఉన్నత విద్యామండలిలో నలుగురు ఉన్నతాధికారుల కోసం తెప్పించిన డ్రైఫ్రూట్స్ ఖర్చు అక్షరాలా 18 లక్షల రూపాయలని తాజాగా అధికారుల పరిశీలనలో తేలింది. గత పాలకుల అండదండలతోనే ఈ వ్యవహారం సాగిందని గుర్తించారు. అయితే ఈ మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్ కు ఖర్చు చేశారా లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా అనేది తేలాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారం సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్తున్నారు.
Image result for APSCHE office
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులులేవు లేవంటూనే అధికారులు, మంత్రులు, సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఖరీదైన హోటళ్లలో ప్రెస్ మీట్లు నిర్వహించ డం, ప్రత్యేక హెలికాఫ్టర్లను వాడటం వంటి అంశాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ అంశాలను ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లోనూ వీటిపై తీవ్ర చర్చ సాగింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధుల దుర్వినియోగం అంశం తెరపైకి వస్తోంది. ఆర్ధికశాఖలో ఉన్నతాధికారు లు ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా వేల కోట్ల నిధులను ప్రాజెక్టులకు కేటాయించినట్లు ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైంది. తాజాగా డ్రైఫ్రూట్స్ వాడకం కోసం ₹ 18 లక్షల ఖర్చు చేయడంపై ప్రభుత్వ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.



గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అక్రమాలను సీఎం జగన్ రివ్యూల్లో అధికారులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం జగన్ వంతవుతోంది. దీంతో ఆయా అంశాలను తన శ్వేతపత్రాల విడుదల సందర్భంగా జగన్ ప్రజలకు వెల్లడిస్తారని తెలుస్తోంది.  సమీక్షల్లో గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి  హోదా లో జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మరిన్ని అక్రమాలను తవ్వితీసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: