మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాలా మార్పులు జరిగాయి.  పార్టీలో సీనియర్ నేతలను పక్కన పెట్టారు.  సుష్మా, సుమిత్రా వంటి వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకోలేదు.  అరుణ్ జైట్లీని పక్కన ఉంచారు.  ఇలా ఎన్నో మార్పులు జరిగాయి.  


గతంలో ఫారెన్ సెక్రెటరీ గా చేసిన జయశంకర్ ను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించి షాక్ ఇచ్చాడు.  అమిత్ షాకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.  దీంతో పాటు మోడీ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.  జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న అజిత్ దోవల్  పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.  


టాలెంట్ ఉన్న వ్యక్తులకు మోడీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.  ఇండియన్ జేమ్స్ బాండ్ అనే బిరుదు ఉంది అజిత్ దోవల్ కు.  ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాడు దోవల్.  పాక్ లో ఎన్నో సంవత్సరాలు ఇండియన్ ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తి ఆయన.  2016 లో బాలాకోట్ దాడి తరువాత... పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్ ను నిర్వహించిన వ్యక్తి దోవల్.  


జాతీయ భద్రత విషయంలో మోడీ తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనుక... దోవల్ హస్తం ఉంటుంది.  దోవల్ కు తెలియకుండా... మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోడు.  ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే దోవల్ అనే చెప్పొచ్చు.  సో, దోవల్ ఉన్నన్ని రోజులు ఉగ్రమూకకు కాలం చెల్లినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: