అవును 2024 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడును ఓడించటమే ఏకైక లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొన్ననే ఎన్నికలై అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ మాత్రం 2024 ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే  వివిధ వర్గాలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.

 

నిజానికి చంద్రబాబు ఓటమే ధ్యేయంగా మొన్నటి ఎన్నికల్లోనే జగన్ ప్లాన్ చేసినా వర్కవుటవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు గెలిచినా చిత్తూరు ఎంపి సీటులో మాత్రం టిడిపి ఓడిపోయింది. కుప్పంలో చంద్రబాబుకు భారీగా తగ్గిపోయిన మెజారిటీనే కారణం. గడచిన ఆరు ఎన్నికల్లో కుప్పంలో చిత్తూరు ఎంపి అభ్యర్ధికి వచ్చే మెజారిటీతోనే టిడిపి గెలుస్తోంది.

 

మొన్నటి ఎన్నికల్లో తనకు కుప్పంలో 70 వేల మెజారిటి వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. కానీ వచ్చింది 30 వేలు మాత్రమే. అంటే వైసిపి గనుక ఇంకాస్త గట్టిగా పట్టుబట్టి ఓ 15 వేల ఓట్లకు గండి కొట్టుంటే చంద్రబాబు మొన్ననే ఓడిపోయేవారేమో. పోలింగ్ కు ముందు వైసిపి అభ్యర్ధి చంద్రమౌళి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటం కూడా వైసిపికి ఇబ్బందిగా మారింది. చంద్రబాబును ఓడించలేకపోయినా మెజారిటీని తగ్గించటంతో వైసిపి నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.

 

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డిపై జగన్ మోపారని సమాచారం.  నిజానికి చంద్రబాబు గడచిన 30 ఏళ్ళుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా జరగాల్సిన అభివృద్ధి అయితే జరగలేదన్నది వాస్తవం. దాన్ని అవకాశంగా తీసుకున్న జగన్ రానున్న ఐదేళ్ళలో కుప్పంలో అభివృద్ధి పనుల్లో ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే 2014 నుండి కుప్పంలో ఖర్చు చేసిన నిధుల వివరాలను అందించమని ఆదేశించారు.

 

నియోజకవర్గంలో వెనుక బడిన వర్గాల జనాభా ఎక్కువ. ఈ వర్గాలను మరింత ఆకట్టుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది  జగన్ టార్గెట్. అందుకు అవసరమైన బ్లూ ప్రింట్ రెడీ చేయమని పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించారట. అంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకోవటం ద్వారా జనాల మద్దతు సంపాదించుకుని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని జగన్ భారీ స్కెచ్చే వేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: