సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని భారతీయ జనతా పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల సమయంలో భాజపా.. ఆ పార్టీ పెద్దలను పట్టించుకోలేదని పడిన మచ్చను ఇప్పుడు తుడిచేసుకోవాలని భావిస్తోంది. ఎల్‌ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి సీనియర్లను మోదీ-షా ద్వయం పక్కన పెట్టిందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సమాధానంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా సీనియర్లకు ఆ పార్టీ మరింత గౌరవం ఇస్తుందనడానికి సూచకంగా వారికి రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. వీరిద్దరితో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా పెద్దల సభకు పంపే యోచనలో భాజపా ఉన్నట్లు పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ వారంలో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: