అన్నీ దారులు మూసుకుపోవటంతో వేరే దారిలేక చివరకు టివి9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం మధ్యాహ్నం పైన సైబర్ క్రైం పోలీసుల ముందు రవి లొంగిపోయారు. అరెస్టు నుండి తప్పించుకునేందుకు రవిప్రకాశ్ చేయని ప్రయత్నం లేదు.

 

అందరికీ నీతులు చెప్పిన రవి తాను మాత్రం ఓ అరాచక వాదిగా నిరూపించుకున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదైనా, పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరయ్యేది లేదని ఎదురుతిరిగారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగారు.

 

దానికితోడు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ కూడా ఓడిపోవటంతో పాపం రవికి లొంగిపోవటం తప్ప వేరే దారిలేకపోయింది. అయినా దింపుడు కళ్ళెం ఆశలాగ సుప్రింకోర్టు తలుపులు తట్టారు. సుప్రింకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. పైగా ఆ విషయం ఏదో హై కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది.

 

ఇక ఎన్ని రోజులు తప్పించుకుని తిరిగినా ఉపయోగం లేదని అందులోను ఎన్నో రోజులు తప్పించుకు తిరగటం సాధ్యం కాదని రవికి అర్ధమైపోయింది. దాంతో ఈరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట రవిప్రకాశ్ లొంగిపోయారు. ఇప్పటికే కేసుల్లో పీకల్లోతు వరకూ కూరుకుపోయిన రవిప్రకాశ విషయంలో చట్టం ఏ విధంగా పనిచేసుకుపోతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: