బిడ్డను మున్సిపల్‌ స్కూల్‌లో చదివించే అధికారికి కీలక పోస్ట్‌..! ..... 
గత ప్రభుత్వ హయాంలో, అమరావతితో పాటు దాని పరిసర గ్రామాల్లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తో...
రాజధాని నిర్మాణ పనుల కోసం సిఆర్‌డిఎ ను ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 3,821 ఎకరాలను భూసేకరణ చట్టం ద్వారా సేకరించారు.. ఆ తరువాత కొందరు రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు.

ఆ వివాదం అలాగే కొనసాగుతోంది. రాజధాని నిర్మాణం కూడా ఒక్క అడుగు ముందుకు సాగలేదు, సింగపూర్‌ ప్లాన్‌లు ఏమయ్యాయో తెలియదు. ఇలాంటి వివాదాస్సద , సమస్యల సంస్ధకు ఒక నిజాయితీ ,నిబద్ధత కలిగిన అధికారి కోసం వెతికి చివరికి, ఐఏఎస్‌ అధికారి పి లక్ష్మీనరసింహం ను జగన్‌ ప్రభుత్వం నియమించింది.

గతంలో ఈయన సాధారణ పరిపాలన కార్యదర్శిగా ఉండి, ఇపుడ సిఆర్‌డిఏ కమిషనర్‌గా వచ్చారు. సామాన్య జీవితం,, కర్నూల్‌ జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ గా పనిచేస్తున్నపుడు, ఆఫీస్‌ ఇచ్చిన అటెండర్లను ఇంటికి రానివ్వకుండా, పొద్దున్నే లేచి మార్కెట్టుకు వెళ్ళి కూరగాయలు కొనుక్కొని ఇంట్లో ఇచ్చి ఆఫీసుకు వెళ్ళడమంటే సామాన్యం కాదు. పైగా కూతుర్ని మునిసిపల్‌ స్కూల్లో చదివించడం... అలాంటి 2003 బ్యాచ్‌ కి చెందిన ఐఏఎస్‌ అధికారి పి .లక్ష్మీనరసింహం ఇప్పుడు సిఆర్‌డిఏ కమిషనర్‌ గా నియమితులయ్యారు.

'' ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకుంటున్న నేను నా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదవించాలని నిర్ణయించాను. దీని వల్ల ప్రభుత్వ బడుల మీద గౌరవం పెరుగుతుంది. అక్కడ కూడా చక్కని విద్యాభోదన జరుగుతుందనే మెసేజ్‌ సమాజానికి చేరుతుంది.' అంటారాయన. అలాగే ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ గా నియమితులైన ముదావత్‌ ఎం నాయక్‌ , పంచాయితీరాజ్‌ కమిషనర్‌గా వచ్చిన గిరిజా శంకర్‌ కూడా పాలన మీద పట్టున్న అధికారులే. 


మరింత సమాచారం తెలుసుకోండి: