ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందిన తర్వాత ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో ఒంటరి వారయ్యారు..ఆ సమయంలో ఇతర పార్టీలు ఆయనపై విరుచుకు పడ్డాయి..ముఖ్యంగా అధికార పార్టీ  టీడీపీ జగన్ ని టార్గెట్ చేసుకొని నానా హింసలు పెట్టాయి.  అలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా తట్టుకొని ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలనున తన బాధలుగా మార్చుకొని మీకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు సీఎం జగన్.

అయితే మొదటి నుంచి సీఎం జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ ఆయన సలహాదారులుగా ఎన్నో బాధ్యతలు తనపే వేసుకొని ఎప్పటికప్పుడు జగన్ బాగోగులు కనిపెట్టుకొని తిరిగిన ప్రతి నేతకు వైఎస్ జగన్ సరైన న్యాయం చేస్తూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కి సహాలు ఇస్తూ ముందుకు నడిపించిన ఎంపీ విజయ సాయి రెడ్డికి ఓ శుభవార్త చెప్పారు జగన్.   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకన్నా ముందే ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడిని నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటేడ్‌తో వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా వైసీపీ పార్లమెంటరీ నేతగా తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని నియమించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి.

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు వెలువరించారు.  లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్‌రెడ్డి, పార్లమెంట్ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌ను జగన్ నియమించారు.లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్‌రెడ్డి, పార్లమెంట్ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌ను జగన్ నియమించారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి జగన్ ప్రత్యేక లేఖను పంపారు. తమ పార్టీ తరఫున వీరిని గుర్తించాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: