మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబునాయుడు పిచ్చ క్యామిడీ చేస్తున్నారు.  నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ ప్రత్యేకహోదా, విభజన హామీలపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ నేతలకు చంద్రబాబు పిలిపివ్వటమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి పెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

 ఓటుకునోటు కేసులో పురోగతి లేకుండా చూసుకోవటం, నియోజకవర్గాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేయటం లాంటి వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైపోయారు. చంద్రబాబు బలహీనతలను ఆసార చేసుకున్న నరేంద్రమోడి ఏపికి దక్కాల్సిన ప్ర్యతేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలను తుంగలో తొక్కేశారు.

 

ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటంతో ఆ కేసు స్పీడ్ కాకుండా చూసుకోవటంలో భాగంగా చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేకంగా నోరిప్పలేదు. పైగా కేంద్రం ఎలా చెబితే అలా పిల్లి మొగ్గలేశారు దాదాపు నాలుగేళ్ళు.  సరే మొన్నటి ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకుని చివరి ఏడాదిలో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి మోడిపై ఫైర్ అయ్యారు.

 

చంద్రబాబు చేష్టల వల్ల చివరకు వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదనుకోండి అది వేరే సంగతి. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాభవం తప్పలేదు. చంద్రబాబు చేసిన తప్పులకు, అవినీతికి, వేసిన పిల్లిమొగ్గలతో విసిగిపోయిన జనాలు చాచి లెంపమీద కొట్టారు. ఈ నేపధ్యంలోనే కేంద్రంపై పోరాటాలు చేయాలంటూ నేతలకు దిశా నిర్దేశం చేయటమే విడ్డూరంగా ఉంది.

 

అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేకహోదా, రైల్వేజోన్ లాంటి విభజన అంశాలపై ఏరోజు కేంద్రంపై గట్టిగా పోరాటం చేసింది లేదు. అలాంటిది అధికారం కోల్పోయి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా ప్రతిపక్ష హోదా మాత్రం దక్కించుకున్న చంద్రబాబు ఇపుడు కేంద్రంపై పోరాటం చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా ? మొత్తానికి చంద్రబాబు మాటలు నేతలకే చాలా క్యామిడిగా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: