తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని ఏపీలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం.

భద్రాద్రిని ఎపిలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర కూడా సై అన్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌ జరిపిన భేటీలో భద్రాద్రి విలీన అంశం కూడా ఉందని తెలిసింది.

భద్రాద్రిని నవ్యాంధ్రలో కలపాలంటే , రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌లో సవరించాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తలుచుకుంటే ఈ ప్రక్రియ పెద్ద కష్టమేం కాదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
 పాలనాపరంగా ఇబ్బందులు ఉండవు... 

రామాలయం సెంటిమెంట్‌ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంచి, చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఎపిలో ఉండటంతో భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రెండు ప్రభుత్వాల చర్చల సారాంశం. తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా, గుడి మాన్యాలు ఎపిలో ఉన్నాయన్నది మరో వాదన.
ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడర ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: