ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దూకుడు పెంచిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఆ మద్య మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని కూల్చి వేయబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు కొన్నాళ్ళూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రగానే పరిపాలన కొనసాగించారు.


తర్వాత కృష్ణానది కరకట్ట పై వెలిసిన అక్రమ నిర్మాణాల్లో ఇదొకటని మొదటి నుంచి పేర్కొంటూ వస్తున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, కరకట్ట పై అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందేనని పట్టుబట్టి ఆందోళనలను సైతం నిర్వహించింది.  ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ముందుగానే మేల్కొన్నట్లు కనిపిస్తుంది. దాంతో ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక లేక రాశారు. 


తన నివాసంలో ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని  ఆయన జగన్‌ను కోరారు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇంట్లోనే ప్రజాక్షేత్రం కొనసాగాలని.. చంద్రబాబునాయుడు ఆ లేఖలో స్పష్టం చేశారు.తన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సందర్శకులను కలుసుకొనేందుకు వీలుగా ప్రజా వేదికను ఉపయోగించుకొంటానని ఆ లేఖలో చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: