ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరమైన కష్టాల్లో ఉంది. ఇప్పటికే ఉన్న పథకాలు కాక కొత్త పథకాల అమలు రాష్ట్రంలో మొదలు కాబోతుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు ఆదాయం మాత్రం పెరగటంలేదు. రాష్ట్రానికి ఎంతో ఆదాయం తెచ్చే మధ్యపానం అంచెలంచలుగా నిషేధం జరుగుతుండటంతో మన రాష్ట్రం మధ్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతుంది.

రాష్ట్ర ఆదాయం పెంచటం కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఇసుక అమ్మటం ద్వారా రాష్ట్ర ఖజానాకు మేలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇంకా మరికొన్ని ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెతుక్కుంటే భవిష్యత్తులో నిధుల లేమి అనే సమస్యను మన రాష్ట్రం అధిగమించవచ్చు.

ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తనదైన మార్కు పాలనతో ప్రజల్ని అధికారుల్ని సంతోషపరిచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధుల పెరుగుదలకు కూడా ప్రత్యమ్నాయ ఆదాయ మార్గాలు వెతుక్కుంటే మాత్ర అతి తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వరణాంధ్రప్రదేశ్గా మారటం మాత్రం ఖాయం


మరింత సమాచారం తెలుసుకోండి: