Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:43 pm IST

Menu &Sections

Search

వారికి మాలా ఉండటం తెలీదు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వారికి మాలా ఉండటం తెలీదు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వారికి మాలా ఉండటం తెలీదు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పెరొందిన అమెరికా అధ్యక్షుడు ప్రతి విషయంలో ఎదో రకంగా తన నోటి దురుసును ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్‌ ప్రపంచ దేశాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. తమ దేశంలాగా మరే ఇతర దేశం పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం లేదంటూ ఆత్మస్తుతి చేసుకున్నారు. ఈ క్రమంలో చైనా, రష్యా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

తన మూడు రోజుల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ట్రంప్‌ బుధవారం బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌ను కలిశారు. ఈ క్రమంలో పర్యావరణం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం ఓ బ్రిటీష్‌ చానల్‌తో మాట్లాడుతూ.. ‘ మొదట 15 నిమిషాల పాటే ఆయన(ప్రిన్స్‌ చార్లెస్‌)తో సమావేశమవ్వాలని భావించాను. కానీ ఆయన మాటలు, పర్యావరణం పట్ల ఆయనకు ఉన్న అవగాహన చూసి గంటన్నర సేపు అలాగే కూర్చుండిపోయాను. నిజానికి ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణలో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి.

భారత్‌, చైనా, రష్యా వంటి దేశాలకు అసలు ఈ విషయంపై ధ్యాసే లేదు. కాలుష్యం, శుభ్రత పట్ల కొంచెం కూడా అవగాహన ఉండదు. ఆ దేశాల్లో స్వచ్ఛమైన గాలి, నీరు అసలే ఉండవు. ఇక శుభ్రమైన పరిసరాలు సరేసరి. భారత్‌, చైనా దేశాల్లో కొన్ని సిటీల గురించి అస్సలు మాట్లాడకపోవడమే మంచిది. మీరు అక్కడికి వెళ్లినట్లైతే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అక్కడ గాలి పీల్చుకోవడం కూడా కష్టమే’ అని ట్రంప్‌ ఆసియా దేశాల గురించి హేళనగా మాట్లాడారు. కాగా పర్యావరణ హితం కోసం అనుసరించాల్సిన విధానాలపై ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. 


అదే విధంగా చాన్నాళ్ల క్రితమే మూతపడిన బొగ్గు ఆధారిత ఫ్యాక్టరీలను కూడా తిరిగి పనిచేసేలా ట్రంప్‌ సర్కారు అనుమతులు ఇచ్చింది. ఇక ప్రపంచ కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల్లో చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ ట్రంప్ మాత్రం సొంత డబ్బా కొట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యధిక జనాభా కలిగి ఉండి, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లలో కాలుష్యం ఉన్న మాట నిజమే గానీ.. తక్కువ జనాభా ఉండి కూడా అత్యధిక కర్బన ఉద్గారాలను విడుదల చేసే అమెరికాతో పోలిస్తే మాత్రం ఇవి కాస్త బెటరే అంటూ ట్రంప్‌ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


trump
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.