రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎక్కువ సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణస్థాయిలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించి తాజా పరిషత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజ‌యం సొంతం చేసుకుంది. ఏకంగా రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలను ఒకే పార్టీ కైవసంచేసుకోవటం, అవికూడా అధికారంలో ఉన్న పార్టీకే దక్కడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారిగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 32 జెడ్పీ పీఠాలపై గులాబీ కండువాలే నిండుగా కనువిందు చేయనున్నాయి. మరోవైపు మండల పీఠాల్లోనూ అదే వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న లెక్కలు, అంచనాల ప్రకారం 445కుపైగా మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఆసీనులుకానున్నారు.


ఇలా భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న నేప‌థ్యంలో...జెడ్పీ పీఠంపై ఎవ‌రు ఆసీనులు కానున్నార‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తుంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం, జిల్లా జడ్పీ చైర్‌ప‌ర్సన్‌లుగా వీరే నియ‌మితులు కానున్నారు. 


కొత్తగూడెం జిల్లా జెడ్పీ ఛైర్మన్... కొరం కనకయ్య
ఆదిలాబాద్ జెడ్పీ ఛైర్మన్... అనిల్ జాదవ్ 
ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ ...కోవా లక్ష్మీ 
మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్.. భాగ్యలక్ష్మీ
కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్.. విజయ
నాగర్ కర్నూలు జెడ్పీ ఛైర్మన్... పి.భరత్ కుమార్
భూపాలపల్లి జెడ్పీ పర్సన్.. జక్కు శ్రీవర్షిణ..
ఖమ్మం జెడ్పీ ఛైర్మన్...లింగాల కమల్ రాజు
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్... పుట్టా మధు
గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్...సరితా తిరుపతయ్య
జగిత్యాల జెడ్పీ ఛైర్ పర్సన్... దారిశెట్టి లావణ్య
మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్...హేమలత శేఖర్ గౌడ్
కామారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్...డి.శోభ
సిద్ధిపేట జెడ్పీ ఛైర్ పర్సన్.... రోజా రాధాకృష్ణ శర్మ
వనపర్తి జెడ్పీ ఛైర్ ఛైర్మన్..లోక్ నాథ్ రెడ్డి 
యాదాద్రి భువనగిరి జెడ్పీ ఛైర్మన్... ఎలిమినేటి సందీప్ రెడ్డి
నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్.. దాదన్నగారి విఠల్ రావు
సంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్.. మంజు శ్రీ
మహబూబ్ నగర్ జెడ్పీ ఛైర్ పర్సన్... స్వర్ణ సుధాకర్ రెడ్డి
రాజన్నసిరిసిల్ల జెడ్పీ ఛైర్ పర్సన్...అరుణ
నిర్మల్ జెడ్పీ ఛైర్ పర్సన్... విజయలక్ష్మీ
మేడ్చల్ జెడ్పీ ఛైర్మన్...ములిపెద్ది శరత్ చంద్రారెడ్డి
వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్...పట్నం సునీతామహేందర్ రెడ్డి
రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్... తీగల అనితా రెడ్డి
నల్గొండ జెడ్పీ ఛైర్మన్... బండా నరేంద్రరెడ్డి
సూర్యపేట జెడ్పీ ఛైర్ పర్సన్... గుజ్జా దీపిక
ఇంకా ప్రకటించని జిల్లాలు ,వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్,జనగాం, ములుగు, మహబూబాద్. వాటికి క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: